జనగామ జిల్లాలోని తెలంగాణ మోడల్ స్కూళ్లలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మొత్తం 32 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ నియామకాలు 09.11.2026 నుండి 31.03.2027 వరకు లేదా అవసరం ముగిసే వరకు(ఏది ముందైతే అది) ఒప్పంద ప్రాతిపదికన కొనసాగుతాయి. మొత్తం 8 మోడల్ స్కూళ్లకు ఖాళీలను కేటాయించారు.
పోస్టులు, జీతం వివరాలు

ఆర్ట్ టీచర్ 8 పోస్టులు -రూ.22,750 జీతం, యోగా టీచర్ 8 పోస్టులు-రూ.22,750, కంప్యూటర్ టీచర్-8పోస్టులు రూ.22,750, లైబ్రేరియన్ 8 పోస్టులు రూ.19,500 జీతంతో మొత్తం 32 ఖాళీలు ఉన్నాయి.
పోస్టులు ఉన్న పాఠశాల్లో బచ్చన్నపేట, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (చౌదరం), కొడకండ్ల, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, లింగాల ఘన్పూర్, నర్మెట్ట మోడల్ స్కూళ్లు ఉన్నాయి. అభ్యర్థుల కనీస వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు దాటకూడదు.
ఆర్ట్ టీచర్: అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్చర్, కమర్షియల్ ఆర్ట్స్, ప్రింట్ మేకింగ్ లేదా యానిమేషన్లో MFA/BFA చేసి ఉండాలి.
యోగా టీచర్: డిగ్రీతో పాటు యోగాలో డిప్లొమా/డిగ్రీ లేదా యోగా స్పెషలైజేషన్‌తో B.P.Ed పూర్తి చేసి ఉండాలి. కంప్యూటర్ టీచర్: కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ లేదా బ్యాచిలర్స్ డిగ్రీ (B.Tech/B.E/MCA/BCA/B.Sc. Computers/B.Com. Computers) కలిగి ఉండాలి.
లైబ్రేరియన్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి లైబ్రరీ సైన్స్ / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో (B.Lib.Sc / M.Lib.Sc) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
అభ్యర్థులకు నిర్వహించే రాత పరీక్ష, లేదా ఇంటర్వ్యూలలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాను రూపొందిస్తారు. పారదర్శకత కోసం మెరిట్ జాబితాను జనగామ జిల్లా అధికారిక వెబ్సైట్లో ప్రదర్శిస్తారు. రాత పరీక్ష తేదీ 07.11.2026న ఉదయం 11:00 గంటలకు ఉంటుంది. పరీక్షను మెయిన్ కాన్ఫరెన్స్ హాల్, IDOC కాంప్లెక్స్, కలెక్టరేట్, జనగామ జిల్లాలో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమతో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు, నలుపు లేదా నీలం రంగు బాల్ పాయింట్ పెన్, ఎగ్జామ్ ప్యాడ్ మాత్రమే తీసుకురావాలి.
దరఖాస్తు పంపాల్సిన చిరునామా
పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థికి IDOC ప్రాంగణంలో DMఅండ్HO ఆధ్వర్యంలో మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ బయోడేటా/రెజ్యూమ్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్ర్ కాపీలను జతచేసి నేరుగా సమర్పించాలి. దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం (DEO Office), మొదటి అంతస్తు, రూమ్ నెం. F27, కలెక్టరేట్, జనగామ జిల్లా.
{{/usCountry}}పరీక్షకు హాజరయ్యే ప్రతి అభ్యర్థికి IDOC ప్రాంగణంలో DMఅండ్HO ఆధ్వర్యంలో మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ బయోడేటా/రెజ్యూమ్‌తో పాటు అవసరమైన సర్టిఫికెట్ల జిరాక్ర్ కాపీలను జతచేసి నేరుగా సమర్పించాలి. దరఖాస్తు సమర్పించాల్సిన చిరునామా: జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం (DEO Office), మొదటి అంతస్తు, రూమ్ నెం. F27, కలెక్టరేట్, జనగామ జిల్లా.
{{/usCountry}}దరఖాస్తులు నవంబర్ 2 నుంచి నవంబర్ 6 వరకు మాత్రమే స్వీకరిస్తారు. వెంటనే అప్లై చేయాలి. చివరి తేదీ 06.11.2026 సాయంత్రం 5 గంటల వరకు పంపించాలి.
జతచేయాల్సిన పత్రాలు
ఎస్ఎస్సీ లేదా తత్సమాన సర్టిఫికెట్, బోనాఫైడ్, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్, బోనాఫైడ్, క్వాలిఫైయింగ్ డిగ్రీ/పీజీ పాస్ సర్టిఫికెట్, బోనాఫైడ్ , అర్హత పరీక్ష మార్కుల మెమోలు, తహశీల్దార్/MRO జారీ చేసిన తాజా కుల ధృవీకరణ పత్రం, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు (ప్రైవేట్ అభ్యర్థులైతే రెసిడెన్స్ సర్టిఫికెట్), అప్లికేషన్‌పై పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌లు, ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు పంపాలి.