తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్( TG EAPCET ) 2026కి హాజరయ్యే విద్యార్థులు ఐదు జిల్లాల్లో పరీక్షా జోన్‌లను ఎంచుకోలేరు. ఎందుకంటే అధికారులు వాటిని బ్లాక్ చేశారు. TG EAPCET 2026 నిర్వహిస్తున్న జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం(JNTU ) హైదరాబాద్ ఈ మేరకు వివరాలు తెలిపింది. మహబూబ్‌నగర్, నల్గొండ, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్‌లలో పరీక్షా జోన్లను స్తంభింపజేసింది. ఈ జిల్లాల నుండి అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయి. అవి పరీక్షా కేంద్రాల సామర్థ్యానికి మించి ఉండటంతో విశ్వవిద్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది.

'ఈ జోన్లకు సామర్థ్యం కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చినందున, వాటిని బ్లాక్ చేశారు. తాజా రిజిస్ట్రేషన్ సమయంలో ఈ జోన్లు కనిపించవు. అభ్యర్థులు తమకు దగ్గరగా ఉన్న పరీక్షా జోన్‌ను ఎంచుకోవాలి. దీని ప్రకారం, విద్యార్థి ఇచ్చిన జోన్ ప్రాధాన్యత ఆధారంగా కేంద్రాలు కేటాయిస్తారు.' అని ఓ అధికారి తెలిపారు.
TG EAPCET కోసం నమోదు చేసుకునేటప్పుడు, అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో పరీక్ష జోన్‌లను ఎంచుకోవాలి. అభ్యర్థుల ప్రాధాన్యత, సంబంధిత జోన్‌లో స్లాట్‌ల లభ్యత ఆధారంగా, పరీక్షా కేంద్రాలను విద్యార్థులకు కేటాయిస్తారు.
ఇప్పటివరకు, 96,892 మంది విద్యార్థులు TG EAPCET 2026 కోసం నమోదు చేసుకున్నారు. మొత్తం 64,861 మంది ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు, 31,918 మంది అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి దరఖాస్తు చేసుకున్నారు. 113 మంది అభ్యర్థులు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రెండింటికీ దరఖాస్తులు సమర్పించారు.
https://eapcet.tgche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 4 చివరి తేదీగా ఉంది. దరఖాస్తు సమర్పించిన తర్వాత, ఏప్రిల్ 6 నుండి 8 వరకు ఎడిట్ ఆప్షన్ అందిస్తారు. ఏప్రిల్ 10, 15 వరకు వరుసగా రూ.250, రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులు తీసుకుంటారు.
అభ్యర్థులు ఏప్రిల్ 20, 24 వరకు రూ.2,500, రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి JNTU-హైదరాబాద్ రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తులను సమర్పించే నిబంధనను తిరిగి ప్రవేశపెట్టింది. అటువంటి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 25, మే 2 మధ్య అంగీకరిస్తారు. రూ.2,500, రూ.5,000, రూ.10,000 ఆలస్య రుసుముతో అప్లై చేసే అభ్యర్థులకు పరీక్షా కేంద్రం హైదరాబాద్ IV జోన్‌లో కేటాయిస్తారు.
{{/usCountry}}అభ్యర్థులు ఏప్రిల్ 20, 24 వరకు రూ.2,500, రూ.5,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి JNTU-హైదరాబాద్ రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తులను సమర్పించే నిబంధనను తిరిగి ప్రవేశపెట్టింది. అటువంటి రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 25, మే 2 మధ్య అంగీకరిస్తారు. రూ.2,500, రూ.5,000, రూ.10,000 ఆలస్య రుసుముతో అప్లై చేసే అభ్యర్థులకు పరీక్షా కేంద్రం హైదరాబాద్ IV జోన్‌లో కేటాయిస్తారు.
{{/usCountry}}అగ్రికల్చర్ అండ్ ఫార్మా ప్రవేశ పరీక్ష హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 23న డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచుతారు. ఇంజనీరింగ్ పరీక్ష హాల్ టిక్కెట్లను ఏప్రిల్ 27న వెబ్‌సైట్‌లో ఉంచుతారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా ప్రవేశ పరీక్ష మే 4, 5వ తేదీల్లో జరగనుంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష మే 9, 10, 11 వరకు నిర్వహిస్తారు.