...
...
Next Story

కౌంటింగ్ డే : జూబ్లీహిల్స్ లో నువ్వా - నేనా..? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్…!

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా ఫైట్ కొనసాగుతోంది. స్వల్ప ఓట్ల తేడాతోనే మెజార్టీ కొనసాగుతోంది. ఏ రౌండ్ లో ఏం జరగబోతుందనేది ఉత్కంఠగా మారింది.

Published on: Nov 14, 2025, 09:55:17 IST
Advertisement

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా టఫ్ ఫైట్ కొనసాగుతోంది. పోస్టల్ ఓట్ల నుంచి మూడు రౌండ్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభించింది. అయితే బీఆర్ఎస్ నుంచి కూడా గట్టి పోటీ కనిపిస్తోంది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కౌంటింగ్

పోస్టల్ ఓట్లలో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యతను ప్రదర్శించగా… ఈవీఎం ఓట్ల మొదటి రౌండ్ లో కాంగ్రెస్ కు 40 ఓట్లకుపైగా లీడ్ లభించింది. అయితే రెండో రౌండ్ వచ్చే సరికి హస్తం హవా కొంచెం పెరిగింది. దాదాపు 1000 ఓట్ల లీడ్ రాగా…. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ కు స్వల్ప మెజార్టీ దక్కింది. మూడో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది.

మొత్తం జూబ్లీహిల్స్ లో 10 రౌండ్లు ఉన్నాయి. రౌండ్ రౌండ్ కు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ లో ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రతి రౌండ్ లోనూ లీడ్ రావటంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందంలో ఉంటున్నారు. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బీజేపీ నుంచి ఆశించిన స్థాయిలో పోటీ కనిపించటం లేదు. పోస్టల్ ఓట్లలో కేవలం 10 ఓట్లు రాగా… ప్రతి రౌండ్ లోనూ అతి తక్కువ ఓట్లు మాత్రమే పోలయ్యాయి. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యనే పోటీ నడుస్తోంది. చివరి రౌండ్ ముగిసే సరికి ఎవరు గెలుస్తారనేది మాత్రం ఉత్కంఠగా మారింది…!

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks