వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం (KU) దూరవిద్య ప్రవేశాలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. జూలై 2026 సెషన్ విద్యాసంవత్సరానికి గాను వివిధ డిగ్రీ, పిజి, డిప్లొమా కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అక్టోబర్ 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు గడువు పొడిగిస్తూ ప్రకటన విడుదలైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం... సెప్టెంబర్ 15వ తేదీతో గడువు ముగిసింది.
యూజీ, పీజీ కోర్సుల వివరాలు:
- అండర్ గ్రాడ్యుయేషన్ (UG) కోర్సులు : డిగ్రీ స్థాయిలో బీ.ఏ (B.A.), బి.కామ్ జనరల్, బి.కామ్ కంప్యూటర్స్, బి.బి.ఏ (BBA), బి.ఎస్సీ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు బీ.ఎల్.ఐ.ఎస్సీలలో ప్రవేశాలు కల్పిస్తున్నారు.
- పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సులు : పీజీ స్థాయిలో ఎం.ఏ పరిధిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, హిస్టరీ, రూరల్ డెవలప్‌మెంట్, సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఎం.కామ్ (M.Com), ఎం.ఎస్.డబ్ల్యూ (MSW), హెచ్.ఆర్.ఎమ్, ఎమ్.ఎల్.ఐ.ఎస్సీ (M.LISc) మరియు ఎం.ఎస్సీ విభాగంలో మ్యాథ్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జూలాలజీ కోర్సులను అందిస్తున్నారు. అలాగే సాంకేతిక విద్య విభాగంలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (MCA) కోర్సులోనూ చేరవచ్చు.
- డిప్లొమా కోర్సులు : నైపుణ్యాభివృద్ధికి దోహదపడే గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్, మేధో సంపత్తి హక్కుల చట్టాలు , కంప్యూటర్ అప్లికేషన్స్, యోగా, ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్, రూరల్ డెవలప్‌మెంట్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, హ్యూమన్ వాల్యూస్ అండ్ ఎథిక్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
- సర్టిఫికెట్ కోర్సులు : ఉపాధి అవకాశాలను పెంచే రీతిలో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, పైథాన్ ద్వారా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్, లైఫ్ & కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, యోగా, గిరిజన అధ్యయనాలు, శాంతి అధ్యయనాలు ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, బయోఇన్ఫర్మాటిక్స్, హ్యూమన్ వాల్యూస్ కోర్సులను ప్రవేశపెట్టారు.
- ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌లు : విద్యార్థుల సృజనాత్మకత, సాంకేతికతకు పదును పెట్టేందుకు మిమిక్రీ, ప్రాణరక్షణ పద్ధతులపై శిక్షణ ఇచ్చే సిపిఆర్ (CPR), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, బ్యూటీషియన్, మెహందీ డిజైనింగ్, సాంప్రదాయ కళ అయిన పేరిణి నృత్యం వంటి అంశాలలో ప్రత్యేక ఓరియంటేషన్ కోర్సులను అందిస్తున్నారు.
అప్లికేషన్ ప్రాసెస్..

{{^htLoading}} {{/htLoading}}
అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్ లేదా నేరుగా ఆఫ్‌లైన్ ద్వారా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి ఉన్నవారు కాకతీయ యూనివర్సిటీ దూర విద్య అధికారిక వెబ్‌సైట్ www.sdlceku.co.in ని సందర్శించి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కోర్సు ఫీజు చెల్లింపులను డిజిటల్ పద్ధతిలో ఆన్‌లైన్ లేదా క్యూఆర్ కోడ్ (QR Code) స్కాన్ చేయడం ద్వారా సులభంగా పూర్తి చేయవచ్చని అధికారులు సూచించారు.
- దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 13 అక్టోబర్ 2026
- అధికారిక వెబ్‌సైట్: https://www.sdlceku.co.in/
- సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 0870-2461480, 0870-2461490
- అధికారిక ఇమెయిల్ ఐడీ: sdlceku@gmail.com
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}