మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏప్రిల్ 25న తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో చురుకుగా పాల్గొనాలని రాష్ట్ర యువతకు, ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు విస్మరించలేనంతటి ప్రాముఖ్యత కలిగిన విషయమని పేర్కొన్నారు. యువత రాజకీయ అంశాలకు దూరంగా ఉండకూడదని కోరారు.

'తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి రాజకీయాలు మన పని కాదని భావించకండి. నిస్సందేహంగా, రాజకీయాలు మన పనే. రాజకీయాలు దైనందిన జీవితంలోని ప్రతి అంశంపై ప్రభావం చూపుతాయి. సామాన్య పౌరులకు దూరమైన విషయంగా వాటిని చూడకూడదు. రాజకీయాలు అంటే మరేదో క్లిష్టమైన రాకెట్ సైన్స్ కాదు. ఒకవేళ అది రాకెట్ సైన్స్ అయినప్పటికీ, మన జీవితంలో విస్మరించలేని అత్యంత ఆవశ్యకమైన విషయం.' అని కవిత అన్నారు.
ముఖ్యంగా తెలంగాణ యువతకు విజ్ఞప్తి చేస్తూ రాజకీయ వ్యవస్థలో ప్రవేశించి, దానిలో అంతర్భాగంగా పనిచేసినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని కవిత పేర్కొన్నారు.
మేడ్చల్‌లోని మునీరాబాద్ దగ్గర అద్వయ ఫంక్షన్ హాలులో కొత్త పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నట్టుగా కవిత ప్రకటించారు. అదే సమయంలో పార్టీ పేరును వెల్లడిస్తామన్నారు. తెలంగాణ జాగృతి సభ్యులు, కార్యకర్తలు, ప్రతీ గ్రామం నుంచి ప్రజలు ఈ కార్యక్రమానికి తరలిరావాలని కవిత విజ్ఞప్తి చేశారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. ఆడబిడ్డల్లో మార్పు తెచ్చేందుకు మహిళగా ఈ పార్టీని పెడుతున్నట్టుగా కవిత పేర్కొన్నారు.
'బీసీ బిల్లు సాధించడం మా వల్లే సాధ్యమవుతుంద. బీసీలీ, దళితులు, గిరిజనులు, మైనారిటీలు పార్టీ ప్రకటన కార్యక్రమానికి తరలిరావాలి. తెలంగాణ రాజకీయాలను శ్రీరాముడి స్ఫూర్తితో గమనించాలి. నేను నిజామాబాద్ బిడ్డను. ఈ మట్టి మంచిది. ఇక్కడి నుంచి తీసుకునే ఏ నిర్ణయం అయినా సక్సెస్ అయింది.' అని కవిత అన్నారు.
గతంలో బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించలేకపోయామని కల్వకుంట్ల కవిత అన్నారు. రోజు ప్రజల అవస్థలు చూశామని చెప్పారు. అందులో భాగంగానే కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్టుగా తెలిపారు. అందరూ మెచ్చేలా పార్టీ ఉంటుందని, సర్వోదయ తెలంగాణ రావాలని కవిత అన్నారు.
{{/usCountry}}గతంలో బీఆర్ఎస్ హయాంలో నీళ్లు, నిధులు, నియామకాలు సంపూర్ణంగా సాధించలేకపోయామని కల్వకుంట్ల కవిత అన్నారు. రోజు ప్రజల అవస్థలు చూశామని చెప్పారు. అందులో భాగంగానే కొత్త రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడినట్టుగా తెలిపారు. అందరూ మెచ్చేలా పార్టీ ఉంటుందని, సర్వోదయ తెలంగాణ రావాలని కవిత అన్నారు.
{{/usCountry}}తాము ఎవరికీ బీ పార్టీ కాదు అని కవిత స్పష్టం చేశారు. తమది నెంబర్ వన్ పార్టీ అవుతుందన్నారు. శ్రీరాముడి స్ఫూర్తితో, సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని పని చేస్తామన్నారు. పోటీ ఎక్కడ నుంచి చేయాలనే విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని కవిత అన్నారు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తా, గల్లీలో పని చేస్తానని కవిత స్పష్టంగా చెప్పారు.