...
...
Next Story

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్‌ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నాను.. మంచి పోస్ట్ ఇస్తా : కవిత

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌ను తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కల్వకుంట్ల కవిత చెప్పారు. ఆయనకు మంచి పోస్ట్ ఇస్తానని వ్యాఖ్యానించారు.

Published on: Jan 25, 2026, 17:38:09 IST
Advertisement

హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌ గౌడ్‌పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శలు గుప్పించారు. తనను కాంగ్రెస్‌లోకి చేర్చుకోమని.. టీపీసీసీ అధ్యక్షుడు అంటున్నారని గుర్తుచేశారు. మహేశ్ కుమార్‌ గౌడ్‌ను జాగృతిలోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. జాగృతిలో చేరితే మంచి పోస్ట్ ఇస్తానని ప్రకటించారు.

కల్వకుంట్ల కవిత
కల్వకుంట్ల కవిత

'అసలు నేనేందుకు కాంగ్రెస్‌లో చేరుతాను? వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయే పార్టీ. రానున్న ఎన్నికల్లో జాగృతి గెలవబోతోంది. నన్ను బద్నాం చేసే పనిలో మహేశ్ గౌడ్ ఉన్నారు. నేను కాంగ్రెస్‌లో చేరుతానని మహేశ్ కుమార్‌ గౌడ్‌కు కల వచ్చిందా? ఆయన మానసిక పరిస్థితి చెక్ చేసుకోవాలి. బలమైన రాజకీయ పార్టీగా జాగృతిని మార్చే ప్రయత్నం చేస్తున్నాను.' అని కవిత అన్నారు.

సృజన్ రెడ్డికి కాంట్రాక్టులను ఇప్పించింది హరీశ్ రావే అని కవిత ఆరోపణలు చేశారు. సృజన్ రెడ్డి పెద్ద తిమింగలంగా మారేందుకు ఆయననే కారణం అని చెప్పారు. రేవంత్ రెడ్డికి సృజన్ రెడ్డి బావమరిది అని హరీశ్ రావుకు అప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. ఆ గుంతలో కేటీఆర్ పడటం బాధకరమన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాయను అని హరీశ్ రావు చెప్పడం దళిత ఉప ముఖ్యమంత్రిని అవమానించడమేనన్నారు.

'కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాస్తానని హరీశ్ రావు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడక్కుండా సీబీఐ ఎలా వస్తుంది? ఈ విషయం హరీశ్ రావుకు తెలియదా? 2014 నుంచి జరిగిన సింగరేణి టెండర్లపై విచారణ జరపాలని చెబుతున్నారు. అంటే కేసీఆర్ పాలన మీద కూడా హరీశ్ రావు విచారణ కోరుతున్నట్టే కదా?' అని కవిత అడిగారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks