బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన శాసనసభ సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేయాలంటూ అధికార కాంగ్రెస్ పార్టీ గళమెత్తింది. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌తోపాటుగా పలువురు కీలక నేతలు పాల్గొని, కేసీఆర్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు మాట్లాడుతూ.. మాజీ సీఎం వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. 'ఏదైనా సంస్థలో పనిచేసే సాధారణ ఉద్యోగి వరుసగా వారం రోజులు ఆఫీస్‌కు రాకపోతే జీతం కోత విధిస్తారు. మరి ప్రజల ద్వారా ఎన్నికై, ప్రజాప్రతినిధిగా ఉంటూ శాసనసభ సమావేశాలకు హాజరుకాకుండా ముఖం చాటేస్తున్న కేసీఆర్‌కు ప్రభుత్వ జీతభత్యాలు ఎందుకు చెల్లించాలి?' అని ఆయన ప్రశ్నించారు.
సభకు వచ్చి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా సరైన సూచనలు ఇవ్వడం బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడి విధి అని వీహెచ్ గుర్తుచేశారు. ఆ బాధ్యతను నిర్వర్తించలేనప్పుడు ఎమ్మెల్యే పదవిలో కొనసాగే హక్కు ఆయనకు లేదని, వెంటనే రాజీనామా చేయాలని వీహెచ్ స్పష్టం చేశారు.
ధర్నా ప్రాంగణంలో కాంగ్రెస్ నేతలు బ్యానర్లు, నినాదాలతో ప్లకార్డులు పట్టుకున్నారు. కేసీఆర్ ప్రజా జీవితానికి దూరంగా ఉంటున్నప్పటికీ ఆయన భద్రత, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, అధికారిక నివాసం, జీతభత్యాల పేరిట ఇప్పటివరకు సుమారు రూ. 21 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారని కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించాయి. ప్రజాధనాన్ని వినియోగించుకుంటూ సభకు, ప్రజలకు దూరంగా ఉండటం ప్రజాస్వామ్య విరుద్ధమని నాయకులు విమర్శించారు.
ఈ వేదికగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన విజయాన్ని వివరించడమే కాకుండా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
{{/usCountry}}ఈ వేదికగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలన విజయాన్ని వివరించడమే కాకుండా, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలోని వైఫల్యాలను, అక్రమాలను ప్రజలకు వివరించేందుకు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
{{/usCountry}}మరోవైపు తెలంగాణ శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ఆరంభం కానున్న తరుణంలో దానికి సరిగ్గా ఒకరోజు ముందే కాంగ్రెస్ ఈ స్థాయి నిరసనను చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్గాలు కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నాయి. కేసీఆర్ తిరిగి అసెంబ్లీలో అడుగుపెడతారని, అయితే అది మళ్లీ ముఖ్యమంత్రి హోదాలోనే జరుగుతుందని గులాబీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.