ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ విచారణ చేస్తోంది. నందినగర్‌లోని ఆయన నివాసానికి పిలిపించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నిఘా నివేదికల ప్రకారం.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నందినగర్‌లో, రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాలలో పెద్ద సమావేశాలు, నిరసనలు నిర్వహించవచ్చవచ్చు.

ఇంటెలిజెన్స్ చీఫ్... కమిషనర్లు, ఎస్పీలకు అలర్ట్ మెసేజ్ జారీ చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చెపట్టే అవకాశం ఉందని, తగిన ముందస్తు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశారు వెళ్లాయి. కేసీఆర్ విచారణ పూర్తయ్యే వరకు అంతటా అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుమానాస్పద పరిస్థితులపై వెంటనే స్పందించాలని ఇంటెలిజెన్స్ చీఫ్ హెచ్చరికలు జారీ చేశారు.
ర్యాలీలు, ధర్నాలు, రోడ్డు దిగ్బంధనాలు, దిష్టిబొమ్మల దహనం ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇవి ప్రజా శాంతికి అంతరాయం కలిగించే అవకాశం ఉందని పోలీసులకు మెసేజ్ వెళ్లింది. ముఖ్యంగా రాబోయే మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇంటెలిజెన్స చీఫ్ సందేశం పంపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కేసీఆర్‌ను బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని ఆయన నివాసంలో ప్రశ్నించడం ప్రారంభించింది. న్యాయ నిపుణులతో తయారు చేసిన ప్రశ్నలతో సిట్ బృందం షెడ్యూల్ చేసిన సమయానికి కొన్ని నిమిషాల ముందు కేసీఆర్ ఇంటికి వచ్చి మధ్యాహ్నం 3 గంటల నుండి విచారణ ప్రారంభించింది.
సిట్ విచారణకు హాజరు కావడానికి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్ నుండి నందినగర్ నివాసానికి మధ్యాహ్నం వచ్చారు. శుక్రవారం ఆయనకు జారీ చేసిన నోటీసుకు ప్రతిస్పందనగా ఆయన విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణ, అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి హైదరాబాద్ పోలీసులు నందినగర్, దాని పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
{{/usCountry}}సిట్ విచారణకు హాజరు కావడానికి కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌస్ నుండి నందినగర్ నివాసానికి మధ్యాహ్నం వచ్చారు. శుక్రవారం ఆయనకు జారీ చేసిన నోటీసుకు ప్రతిస్పందనగా ఆయన విచారణకు హాజరయ్యారు. సిట్ విచారణ, అవాంఛనీయ సంఘటనలను నివారించడానికి హైదరాబాద్ పోలీసులు నందినగర్, దాని పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
{{/usCountry}}నందినగర్‌కు ఇతరుల రాకపోకలను నియంత్రించడానికి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. నగరంలో అలజడి సృష్టించే ప్రయత్నాలను తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులపై నిఘా ఉంచారు. బంజారాహిల్స్, పరిసర ప్రాంతాలలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.