...
...
Next Story

ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ.. నాలుగున్నర గంటలకుపైగా ప్రశ్నించిన అధికారులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ సిట్‌ విచారణ ముగిసింది. సుమారు నాలుగున్నర గంటలకుపైగా సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు.

Published on: Feb 01, 2026 08:39 PM IST
Advertisement

హైదరాబాద్ నందినగర్‌లో మాజీ సీఎం కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ముగిసింది. దాదాపు 4 గంటల 45నిమిషాల సిట్ విచారణ కొనసాగింది. పలు కోణాల్లో సిట్ అధికారులు ప్రశ్నలు వేశారు. కేసీఆర్ విచారణను సిట్ అధికారులు ఆడియో, వీడియో రికార్డు చేశారు. విచారణ తర్వాత సిట్ అధికారులు కేసీఆర్ నివాసం నుంచి వెళ్లిపోయారు. అనంతరం కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కేసీఆర్ సమావేశం అయ్యారు. విచారణ తర్వాత తన నివాసంలో నుంచి కార్యకర్తలకు కేసీఆర్ అభివాదం చేశారు.

విచారణ తర్వాత కేసీఆర్
విచారణ తర్వాత కేసీఆర్

ఈ విచారణలో భాగంగా అధికారులు పలు కీలక ప్రశ్నలు కేసీఆర్‌కు వేసినట్టుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా అని నేరుగా ప్రశ్నించినట్టు సమాచారం. ఈ విషయం చుట్టూనే ఎక్కువగా ప్రశ్నలు వేశారని తెలుస్తోంది. గతంలోని పలువురి వాంగ్మూలాల ఆధారంగా సిట్ ప్రశ్నలు తయారు చేసుకుంది.

ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెుదలైందనే ప్రశ్నను కూడా కేసీఆర్‌కు అధికారులు వేశారు. కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారని సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు? ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు? అని దీనికి అనుబంధం ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా? అని కూడా అడిగారని అంటున్నారు.

మరోవైపు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పదవీకాలం గురించి ఇప్పటికే సంతోష్ రావుకు కూడా ప్రశ్నలు వేశారు సిట్ అధికారులు. తాజాగా కేసీఆర్‌‌కు కూడా ప్రశ్నలు సంధించారు. పదవీకాలం ముగిసిన తర్వాత.. ప్రభాకర్ రావు పదవిని మళ్లీ ఎందుకు పొడిగించారని అడిగినట్టుగా తెలుస్తోంది. దీని వెనక కారణాలు ఏంటి అని సిట్ అధికారులు కేసీఆర్‌కు ప్రశ్నలు వేసినట్టుగా సమాచారం.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe