TG Rythu Bharosa Application : రైతు భరోసా స్కీమ్ అప్డేట్ - కొత్త దరఖాస్తులు ప్రారంభం, ఇలా అప్లయ్ చేసుకోండి
Telangana Rythu Bharosa Application : తెలంగాణలో కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులకు ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకుంటే వానాకాలం రైతు భరోసా సాయం అందుతుందని ప్రకటించింది.
Telangana Rythu Bharosa Applications : తెలంగాణలోని కొత్త పట్టాదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఈ నెల 15వ తేదీ వరకు కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి, పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులందరూ రైతు భరోసా పథకానికి అర్హులని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్తగా పాస్‌పుస్తకాలు అందుకున్న రైతులు వెంటనే తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించింది.

ఈనెల 30న నిధులు విడుదల….
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 30వ తేదీన రైతు భరోసా వానాకాలం సీజన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ నేపథ్యంలో, ఇప్పటికే పథకంలో నమోదైన పాత రైతులతో పాటు కొత్తగా భూములు కొన్నవారికి కూడా ఈ విడతలోనే సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోగా పేర్లు నమోదు చేసుకున్న కొత్త పట్టాదారులందరికీ ఈ వానాకాలం సాయం నేరుగా అందుతుందని అధికారులు వెల్లడించారు.
కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈవో)ని లేదా మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)ని కలిసి తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. పాస్‌పుస్తకం ప్రతి, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలతో అధికారులను సంప్రదించి, గడువు ముగిసేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ కోరింది. కొత్త రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు స్పష్టం చేశారు.
ఏఏ పత్రాలు ఉండాలి..?
- పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
- రైతు ఆధార్ కార్డుతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించాలి.
- అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల వద్ద లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి.
రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి రూ. 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం రెండు దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి విడతలో రూ. 6,000 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి. ఖరీఫ్, రబీ సీజన్ ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందుతుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

