...
...
Next Story

హైదరాబాద్‌ మెట్రో రెండో దశపై కీలక అప్డేట్.. కిషన్ రెడ్డి ఏం అన్నారంటే?

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ డీపీఆర్‌ అందిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ చెప్పారని కిషన్ రెడ్డి అన్నారు. మెట్రోకు సూత్రప్రాయ అంగీకారానికి కేంద్రానికి అభ్యంతరం లేదని తెలిపారు.

Published on: May 20, 2026, 14:58:10 IST
Advertisement

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రెండో దశ పట్ల కేంద్రం సూత్రప్రాయంగా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంతో 50:50 వ్యయ-భాగస్వామ్య పద్ధతిలో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉందని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారన్నారు.

మనోహర్ లాల్ ఖట్టర్‌తో కిషన్ రెడ్డి
మనోహర్ లాల్ ఖట్టర్‌తో కిషన్ రెడ్డి

హైదరాబాద్ మెట్రో రైలు రెండవ దశ విస్తరణ కోసం 162 కిలోమీటర్ల పరిధిని కవర్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రతిపాదనలను సమర్పించిందని కేంద్రమంత్రి ఖట్టర్ ప్రస్తావించారు. ఈ ప్రతిపాదనను కేంద్రం "సానుకూలంగా పరిశీలిస్తుందని", "అవసరమైన తదుపరి చర్యలను" ప్రారంభిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో రెండవ దశ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక అంశాలను కూడా సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం Lఅండ్T సంస్థ నుండి ఈ ప్రాజెక్టు బాధ్యతలను స్వీకరించినందున, కేంద్రం 'వివరమైన ప్రాజెక్టు నివేదిక' (DPR), ఇతర సాంకేతిక నిర్దేశాలను సమగ్రంగా పరిశీలిస్తుందని కేంద్రమంత్రి ఖట్టర్ సూచించారు. డీపీఆర్, సంబంధిత సమాచారం అందిన తర్వాత, రెండో దశలోని మిగిలిన అంశాలను పరిశీలిస్తారని, ఆ తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రధాన పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను, ముఖ్యంగా మూసీ నది పరిశుభ్రత, పునరుజ్జీవనానికి సంబంధించిన వాటిని కేంద్రమంత్రులు మంత్రులు సంయుక్తంగా సమీక్షించారు. కేంద్రం అమలు చేస్తున్న AMRUT 2.0 పథకం కింద, మూసీ నదిలోకి ప్రవహించే మురుగునీటిని శుద్ధి చేయడానికి 39 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు మంజూరు చేసినట్లు కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.3,975 కోట్లుగా ఉంది.

'రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 162 కిలోమీటర్ల మేర మెట్రో రెండోదశ విస్తరణకు ప్రతిపాదనలు సమర్పించింది. దానిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుంది. 39 ఎస్‌టీపీల ద్వారా రోజుకు 972 మిలియన్ లీటర్ల మురుగు నీటిని శుద్ధి చేసే సామర్థ్యం ఉంది. హైదరాబాద్ నగర అభివృద్ధికి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకారం అందిస్తోంది.' అని మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారని కిషన్ రెడ్డి వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks