హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌పై కీలక అప్డేట్.. రూ. 275 కోట్లు మంజూరు

Hyderabad Metro 2nd Phase : హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు సెకండ్ ఫేజ్‌పై కీలక అప్డేట్ వచ్చింది. ఇందులో భాగగా రూ.275 కోట్లు మంజూరు అయ్యాయి.

Published on: Nov 2, 2026, 16:06:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాజధాని నగరం హైదరాబాద్‌లో వేగవంతమైన, సురక్షితమైన రవాణా వ్యవస్థను మరింత విస్తరించేందుకు మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ తదుపరి పనులను వేగవంతం చేయడంతో పాటు ఆర్థిక అవసరాల కోసం రూ. 275 కోట్లను మంజూరు చేస్తూ పరిపాలనాపరమైన అనుమతులు కేంద్రం ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో నగరంలో మెట్రో విస్తరణ పనుల మరింత ముందుకు వెళ్లనున్నాయి.

హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ అప్డేట్
హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ అప్డేట్

ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రూ. 275 కోట్ల నిధులను ప్రధానంగా రెండు ముఖ్యమైన విభాగాలుగా విభజించి కేటాయింపులు జరిపారు. హైదరాబాద్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే కొత్త మార్గాల్లో మెట్రో సేవలను విస్తరించేందుకు ప్రతిపాదించిన ఫేజ్-2 నిర్మాణ పనుల వేగాన్ని పెంచడానికి రూ. 150 కోట్లను కేటాయించారు. అలైన్‌మెంట్ సర్వేలు, ప్రాథమిక పనులు, డీపీఆర్ పురోగతి, తదుపరి నిర్మాణ ప్రాసెస్ కోసం ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. మరో రూ.125 కోట్లను రుణం రూపంలో ఇవ్వనుంది.

నగరంలో పెరుగుతున్న జనాభా, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని పాతబస్తీ కనెక్టివిటీ, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మార్గం, మైండ్ స్పేస్ – శంషాబాద్ కారిడార్లతో పాటు ప్రధాన రహదారులను కలుపుతూ ఫేజ్-2 ప్రాజెక్టును ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించింది. రెండో దశలో రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల మేర రైలు విస్తరణకు గతంలో అనుమతి లభించింది.

నగరంలోని ఐటీ కారిడార్లు, నివాస ప్రాంతాలు, కమర్షియల్ హబ్‌లను అనుసంధానించడం ద్వారా నిత్యం ప్రయాణించే లక్షలాది మందికి ఉపశమనం లభిస్తుంది. నగరం నుంచి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ఈ విస్తరణ ప్రధాన లక్ష్యం.

మెట్రో లైన్ల విస్తరణతో కొత్తగా కవర్ అయ్యే ప్రాంతాలలో రియల్ ఎస్టేట్, వాణిజ్య రంగాలు మరింత పుంజుకోనున్నాయి. ప్రభుత్వం తక్షణమే నిధులను విడుదల చేయడంతో ఫేజ్-2కి సంబంధించి నిలిచిపోయిన లేదా మందకొడిగా సాగుతున్న పనులు వేగవంతం కానున్నాయి. రుణాల చెల్లింపుల కోసం స్పష్టమైన నిధుల కేటాయింపులు జరగడం వల్ల ప్రాజెక్ట్ ఆర్థిక నిర్వహణ మరింత సులభతరం కానుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More