తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత దిశగా ప్రభుత్వం మరొక కీలక ముందడుగు వేసింది. న్యూ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(NEHS) అమలుకు సంబంధించి సమగ్ర బోర్డు ఆమోదిత మార్గదర్శకాలను విడుదల చేస్తూ తెలంగాణ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకం(New Employees Health Scheme - NEHS) అమలుకు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను ప్రభుత్వం అధికారికంగా అమలు చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. ట్రస్టీల బోర్డు ఆమోదంతో రూపొందించిన ఈ పాలనా, నిర్వహణ మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, EHCT ఛైర్మన్ సంజయ్ జాజు జారీ చేశారు.
ఈ నూతన మార్గదర్శకాలు జులై 17, 2026 నుండి అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ట్రస్ట్ నిర్ణయం ప్రకారం ఈ కొత్త విధివిధానాలు 17.07.2026 నుండి వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓతో పాటు సంబంధిత అధికారులు ఈ పథకాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 40 (17.06.2026), జీఓ ఎంఎస్ నంబర్ 50 (16.07.2026)లకు అనుగుణంగా, ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్ణయాల ప్రాతిపదికన ఈ మార్గదర్శకాలు రూపొందించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మెరుగైన, ఉచిత వైద్య సేవలు అందించేందుకు ఈ స్కీమ్ ఎంతో దోహదపడుతుంది. ఉద్యోగులు, పెన్షనర్లు కార్పొరేట్, నెట్‌వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందే వెసులుబాటు ఉంటుంది.
పథకం సులభంగా, పారదర్శకంగా, ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా అమలు కావడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయి. ఎంప్లానెల్ అయిన అన్ని ప్రధాన ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్-పేషెంట్ చికిత్సలతో పాటు క్లిష్టమైన ఆపరేషన్లకు ఈ పథకం వర్తిస్తుంది.
{{/usCountry}}పథకం సులభంగా, పారదర్శకంగా, ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా అమలు కావడానికి ఈ కొత్త నిబంధనలు ఉపయోగపడతాయి. ఎంప్లానెల్ అయిన అన్ని ప్రధాన ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులలో ఇన్-పేషెంట్ చికిత్సలతో పాటు క్లిష్టమైన ఆపరేషన్లకు ఈ పథకం వర్తిస్తుంది.
{{/usCountry}}రాష్ట్ర సచివాలయం, అన్ని శాఖల అధిపతులు, జిల్లా స్థాయి అధికారులకు ఈ ఉత్తర్వుల ప్రతులను పంపిస్తూ, పథకాన్ని తక్షణమే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు సంబంధిత ఆసుపత్రుల్లో క్యాష్‌లెస్ వైద్య సేవలు పొందవచ్చు. మార్గదర్శకాల బుక్‌లెట్‌లో ఆసుపత్రుల ఎంపానెల్‌మెంట్ ప్రక్రియ , చికిత్సా ప్రోటోకాల్స్ , ఆసుపత్రుల బకాయిల చెల్లింపులకు సంబంధించిన విధానాలు ఉంటాయి. లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చికిత్సలు పొందనున్నారు.