ఇందిరమ్మ ఇళ్లపై కీలక అప్డేట్స్.. వన్ టైమ్ క్లియరెన్స్, వారికి మంజూరైనా క్యాన్సిల్
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు ఎటువంటి అడ్డంకులు లేకుండా నిధులు అందేలా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో లబ్ధిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం తొలగించింది. నిర్మాణంలో ఉన్న ఇళ్లకు నిధులు అందేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన అనేక విజ్ఞప్తులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు సానుకూలంగా పరిగణనలోకి తీసుకున్నట్టుగా పొంగులేటి చెప్పారు. ఇప్పటికే నిర్మాణం ప్రారంభించిన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా నిబంధనలను సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్‌లో ఇప్పటికే మంజూరై బేస్‌మెంట్ లేదా అంతకంటే పై స్థాయికి చేరుకున్న ఇళ్లకు L3 నుంచి L1 కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి (One-time Clearance) ఇస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం అనుమతించిందని మంత్రి పొంగులేటి తెలిపారు.
ఈ ప్రత్యేక సడలింపు ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తులో L3 మంజూరులకు దీనిని ప్రాతిపదికగా పరిగణించరాదని మంత్రి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఏర్పడే మొత్తం ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. అదేవిధంగా ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణం ప్రారంభం కాని వాటిని రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
మళ్లీ లాటరీ
హైదరాబాద్ మహానగర పరిధిలోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. లబ్ధిదారుల పారదర్శక ఎంపిక కోసం అధికారులు చేపట్టిన క్షేత్రస్థాయి పరిశీలన ముగింపునకు రాగా కొన్ని చోట్ల అర్హులైన స్థానిక అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రస్తుతం అమలవుతున్న ప్రాసెస్ ప్రకారం.. ఒక్కో నియోజకవర్గానికి మొత్తం 600 మందిని ఎంపిక చేస్తున్నారు. ఇందులో 480 మందితో ముఖ్య లబ్ధిదారుల జాబితా, మరో 120 వెయిటింగ్ లిస్ట్ రూపకల్పన చేశారు. అయితే అధికారులు నిర్వహించిన భౌతిక తనిఖీల్లో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
ఇబ్రహీంపట్నం, ఖైరతాబాద్, నియోజకవర్గాల్లో కేటాయించిన ఇళ్ల సంఖ్యతో పోలిస్తే స్థానికులుగా అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అధికారులు గమనించారు. దీంతో ఇక్కడ మిగిలిపోయిన ఇళ్ల కోసం స్థానిక దరఖాస్తుదారులతో మరోసారి లాటరీ తీసే ఆలోచనలో యంత్రాంగం ఉంది.
కూకట్‌పల్లి నాన్-లోకల్స్‌ను ఎంపిక చేశారనే ఫిర్యాదులు వచ్చినప్పటికీ, ఇళ్ల సంఖ్యకు తగినంత మంది స్థానికులు లభ్యమయ్యారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇక్కడ కూడా అర్హుల కొరత ఏర్పడితే పునఃపరిశీలన లేదా మరో డ్రా నిర్వహిస్తారు.
ఇందిరమ్మ టవర్స్ ఇళ్లకు తుది ఎంపికైన అర్హులైన అభ్యర్థులకు సోమవారం నుంచి అలాట్‌మెంట్ లెటర్స్ డిజిటల్ రూపంలో పంపుతున్నారు. లబ్ధిదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా నేరుగా సమాచారం అందుతుంది. దరఖాస్తు సమయంలో నియోజకవర్గం పేరును పొరపాటుగా నమోదు చేసిన వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అటువంటి అభ్యర్థులు ఈ నెల 25వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో తమ వివరాలను సరిచేసుకునే వెసులుబాటు కల్పించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


