TG Indiramma Flats : ఇందిరమ్మ ఫ్లాట్ల లబ్ధిదారులకు అలర్ట్ - నేటి నుంచే అలాట్‌మెంట్ లెటర్లు, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే..?

తెలంగాణలో ఇందిరమ్మ ఫ్లాట్ల లబ్ధిదారులకు అప్డేట్ వచ్చేసింది. ఇవాళ్టి నుంచి అలాట్‌మెంట్ లెటర్లు జారీ చేయనున్నట్లు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రకటించింది. వాట్సప్, SMS ద్వారా నేరుగా పత్రాలు అందనున్నాయి.

Published on: Sep 21, 2026, 06:02:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్యూర్ పరిధిలో ఇందిరమ్మ (తక్కువ ఆదాయ వర్గాల) ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు (కేటాయింపు పత్రాలు) జారీ చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రకటన జారీ చేసింది.

ఇందిరమ్మ టవర్స్ నమూనా
ఇందిరమ్మ టవర్స్ నమూనా

డిజిటల్ విధానంలో….

లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా డిజిటల్ విధానంలో ఈ పత్రాలను పంపిణీ చేస్తోంది. ఎంపికైన వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా వాట్సాప్ (WhatsApp), ఎస్సెమ్మెస్ (SMS) ద్వారా ఈ అలాట్‌మెంట్ లేఖలను పంపుతున్నారు. దీనివల్ల లబ్ధిదారులు వేగంగా, ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ వివరాలను సరిచూసుకునే అవకాశం లభిస్తుంది.

వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ ఇలా...

ఫోన్ ద్వారా మాత్రమే కాకుండా అధికారిక పోర్టల్ ( https://tghb.telangana.gov.in/cure-status ) నుంచి కూడా ఈ పత్రాలను పొందవచ్చు. లబ్ధిదారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను నమోదు చేయడం ద్వారా నేరుగా అలాట్‌మెంట్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. సందేహాలు ఉన్నవారు హౌసింగ్ బోర్డు సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.

తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారికంగా జారీ చేసే ప్రకటనలు, కేటాయింపు పత్రాలు, సంబంధిత అధికారుల సూచనలను మాత్రమే విశ్వసించాలని కమిషనర్ గౌతమ్ లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఇతర వ్యక్తులు తెలిపే ఖాతాలకు లేదా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ చేయవద్దని హెచ్చరించారు. ఇల్లు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినా లేదా అనధికారిక ఖాతాలకు చెల్లించాలని కోరినా వెంటనే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More