Komuravelli Railway Station : లక్షలాది మంది భక్తుల ఆరాధ్యదైవం కొమరవెల్లి మల్లన్న స్వామి భక్తులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కొమరవెల్లి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ నిర్మించిన "కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్" ప్రారంభానికి ముహుర్తం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీన ఈ రైల్వే స్టేషన్ అధికారికంగా ప్రారంభమవుతుంది.

కొమరవెల్లి క్షేత్రానికి రైలు కనెక్టివిటీని పెంచేందుకు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ రైల్వే స్టేషన్ నిర్మాణం కోసం రూ. 5.63 కోట్ల నిధులను కేటాయించింది. ఇటీవలనే 100 శాతం పనులు పూర్తి కావటంతో.... ఈనెల 26న ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.
కొమరవెల్లి రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు :
- సుందరమైన ప్రవేశ ద్వారంతో (పోర్టికో) కూడిన స్టేషన్ భవనాన్ని నిర్మించారు.
- రైలు ఎక్కడానికి, దిగడానికి వీలుగా 450 మీటర్ల పొడవు, 10 మీటర్ల వెడల్పుతో భారీ హై-లెవెల్ ప్యాసింజర్ ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటు చేశారు.
- ఎండ, వానల నుంచి రక్షణ కోసం ప్లాట్‌ఫారమ్‌పై ఐదు అధునాతన షెల్టర్లను ఏర్పాటు చేశారు.
- ప్రయాణికులు వేచి ఉండటానికి విశాలమైన వెయిటింగ్ హాల్‌ను అందుబాటులోకి తెచ్చారు.
- ప్లాట్‌ఫారమ్‌పై కూర్చోవడానికి వీలుగా త్రీ-సీటర్ బెంచీలను అమర్చారు.
- టికెట్ల జారీ కోసం ఆధునిక బుకింగ్ కౌంటర్లను సిద్ధం చేశారు.
- స్టేషన్ వెలుపల వాహనాల రాకపోకల కోసం విశాలమైన సర్క్యులేటింగ్ ఏరియా, ప్రత్యేక పార్కింగ్ వసతులను కల్పించారు.
- ప్లాట్‌ఫారమ్‌పై ప్రయాణికుల కోసం సురక్షితమైన తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులో ఉంచారు.
- మహిళలు, పురుషులతో పాటు దివ్యాంగుల (దివ్యాంగజన్) కోసం ప్రత్యేకంగా ఆధునిక శౌచాలయాలను నిర్మించారు.
- స్టేషన్‌కు చేరుకోవడానికి వీలుగా రోడ్లను చక్కగా అభివృద్ధి చేశారు.
- స్థానిక సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా స్టేషన్ భవన ముఖద్వారాన్ని (ఆర్కిటెక్చరల్ ఎలివేషన్) తీర్చిదిద్దారు.
- కొమరవెల్లి మల్లన్న స్వామి వైభవాన్ని, స్థానిక అడవులు, జంతుజాలాన్ని (ఫ్లోరా అండ్ ఫౌనా) ప్రతిబింబించేలా గోడలపై అద్భుతమైన మురళీ చిత్రాలను (మ్యూరల్ పెయింటింగ్స్) వేయించారు.
కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇకపై నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. స్టేషన్లో కల్పించిన ఆధునిక వసతుల వల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా ఆధ్యాత్మిక పర్యాటకం (రిలిజియస్ టూరిజం) పెరగడంతో పాటు వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుని స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా స్టేట్ హైవే-1కి ఈ స్టేషన్ దగ్గరగా ఉండటంతో వల్ల…. రైలు దిగిన భక్తులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా అనుసంధానత (లాస్ట్-మైల్ కనెక్టివిటీ) మెరుగవుతుంది.
{{/usCountry}}కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇకపై నేరుగా రైలు మార్గం అందుబాటులోకి వస్తుంది. స్టేషన్లో కల్పించిన ఆధునిక వసతుల వల్ల ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల స్థానికంగా ఆధ్యాత్మిక పర్యాటకం (రిలిజియస్ టూరిజం) పెరగడంతో పాటు వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుని స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా స్టేట్ హైవే-1కి ఈ స్టేషన్ దగ్గరగా ఉండటంతో వల్ల…. రైలు దిగిన భక్తులు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా రవాణా అనుసంధానత (లాస్ట్-మైల్ కనెక్టివిటీ) మెరుగవుతుంది.
{{/usCountry}}