హైదరాబాద్ మరో అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవానికి ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత్, దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక బంధాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ శిల్పకళా వేదికలో కె-హార్మొనీ ఫెస్టా 2026(K-Harmony Festa 2026) అత్యంత వైభవంగా జరగనుంది. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా(KCCI), తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు.

కొరియా కల్చర్ డే 2026 వేడుకల్లో భాగంగా వన్ లైట్, టూ సిటీస్(One Light, Two Cities) అనే ప్రత్యేక థీమ్‌తో ఈ ఫెస్టివల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుక సీయోల్, హైదరాబాద్ నగరాల మధ్య ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను వేడుకలా జరుపుకోవడానికి ఒక గొప్ప వేదికగా నిలవనుంది.
ఈ ఈవెంట్ శిల్పకళా వేదికలో అక్టోబర్ 25(ఆదివారం)న జరగనుంది. మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సందర్శకులకు ప్రవేశం ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు అధికారిక ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది.
ఈ సాంస్కృతిక ఉత్సవంలో రెండు దేశాల సాంప్రదాయ, ఆధునిక కళారూపాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలంగాణ గడ్డకు చెందిన వీరత్వానికి ప్రతీక అయిన పేరిణి శివతాండవం, జానపద కళారూపం డప్పుల ప్రదర్శనలు నగరవాసులను ఆకట్టుకోనుండగా; మరోవైపు కొరియాకు చెందిన సాంప్రదాయ కళలు, సంగీతం పోటీపడనున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ ‘NTX’ కే-పాప్ బాయ్ బ్యాండ్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఈ ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనుంది. కొరియన్ మార్షల్ ఆర్ట్ తైక్వాండో యోధుల సాహసోపేత విన్యాసాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. కొరియన్ సాంప్రదాయ సంగీతం: కొరియా సంస్కృతిని ప్రతిబింబించే సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయి.
ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు దేశాల మధ్య పరస్పర అవగాహనను, స్నేహ సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 'ఇలాంటి అంతర్జాతీయ వేదికలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుసంపన్నమైన చారిత్రక వారసత్వాన్ని, జానపద కళలను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచస్థాయిలో ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తాయి. తెలంగాణ కళారూపాలు అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించడం మనందరికీ గర్వకారణం.' అని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}ఈ సందర్భంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు దేశాల మధ్య పరస్పర అవగాహనను, స్నేహ సంబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. 'ఇలాంటి అంతర్జాతీయ వేదికలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుసంపన్నమైన చారిత్రక వారసత్వాన్ని, జానపద కళలను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచస్థాయిలో ప్రదర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తాయి. తెలంగాణ కళారూపాలు అంతర్జాతీయ ప్రేక్షకులను అలరించడం మనందరికీ గర్వకారణం.' అని ఆయన పేర్కొన్నారు.
{{/usCountry}}గత కొన్నేళ్లుగా భారతదేశంలో, ముఖ్యంగా యువతలో కొరియన్ కల్చర్‌ను ఇష్టపడేవారి సంఖ్య పెరుగుతోంది. కే-డ్రామాలు, కే-పాప్ సంగీతం, కొరియన్ వంటకాలకు హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లో విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో శిల్పకళా వేదికలో జరుగుతున్న ‘కె-హార్మొనీ ఫెస్టా 2026’ నగరంలోని కే-పాప్ ప్రేమికులకు, కళాభిమానులను ఆకట్టుకోనున్నాయి.