మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన నలుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణలోని కాగజ్‌నగర్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. ఇందులో ఒక బాలిక కూడా ఉంది.

Published on: Dec 25, 2025, 12:08:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి చెందారు. చంద్రపూర్ జిల్లాలోని దేవదా తహసీల్‌లోని సోండో గ్రామ శివార్లలోని వంతెన పై నుంచి వాగులోకి కారు దూసుకెళ్లడంతో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన ముగ్గురు మహిళలు, ఒక బాలిక అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి
మహారాష్ట్రలో తెలంగాణకు చెందిన నలుగురు మృతి

కాగజ్‌నగర్ పట్టణంలోని నిజాముద్దీన్ కాలనీకి చెందిన జకీర్ భార్య సల్మా బేగం, వారి కుమార్తె షబ్రీమ్, బంధువులు అఫ్జా బేగం, సహారలు నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి వెళ్లారు. తిరిగి వస్తుండగా సోండో గ్రామ శివార్లలోని వంతెన పై నుంచి కారు పడింది. దీంతో కారు కింద చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారుజామున 1 గంటల ప్రాంతంలో నలుగురు అక్కడికక్కడే మరణించారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు బంధువులు కూడా గాయపడ్డారు.

జకీర్ అనే ఆటో రిక్షా డ్రైవర్ మాట్లాడుతూ.. గాయపడిన వారిని చంద్రపూర్ పట్టణంలోని ఆసుపత్రికి తరలించామన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో నాగ్‌పూర్ నగరంలోని ఒక ఆసుపత్రికి వైద్య అత్యవసర పరిస్థితి కోసం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు.

కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు వ్యక్తులు మరణించడంతో కాగజ్‌నగర్‌లో విషాదం అలుముకుంది. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బస్సు బోల్తా

మహబూబ్‌నగర్‌లో జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. బాలానగర్ దగ్గరలో రోడ్డు ప్రమాదం అయింది. ఈ ఘటనలో హైదరాబాద్-బెంగళూరు నేషనల్ హైవేపై ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బోల్తా పడింది. అయితే బస్సులో కొంతమంది ఉన్నట్టుగా చెబుతున్నారు. ఇదే సమయంలో హైవేపై వెనక నుంచి వచ్చిన ఓ వాహనం ఢీ కొట్టింది. దీంతో బోస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో కొంతమందికి గాయాలు అయ్యాయి. వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More