న్యూ ఇయర్ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం విక్రయదారులు, వినియోగదారులకు ఊరటనిచ్చేలా….డిసెంబర్ 31వ తేదీన మద్యం విక్రయాల వేళలను పొడిగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక జీవోను జారీ చేసింది.
అర్ధరాత్రి వరకు ఓపెన్….
ఎక్సైజ్ శాఖ ఉత్తర్వుల ప్రకారం…. రాష్ట్రంలోని అన్ని వైన్ షాపులు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇక బార్లు, క్లబ్బులు , టూరిజం ప్రాంతాల్లోని హోటళ్లు, అలాగే ప్రత్యేకంగా అనుమతి పొందిన ఈవెంట్ నిర్వాహకులకు రాత్రి ఒంటి గంట వరకు పని చేయడానికి అనుమతి ఉంటుంది.
మరోవైపు న్యూ ఇయర్ వేళ హద్దుదాటి ప్రవర్తించే వారిపై పోలీస్ శాఖ నిఘా పెట్టనుంది. డిసెంబర్ 27వ తేదీ నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ కూడా ప్రత్యేక తనిఖీలు , డ్రైవ్స్ చేపట్టనుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా వచ్చే మద్యం (NDPL) , నిషేధిత మాదకద్రవ్యాల (NDPS) అక్రమ రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఎక్కడిక్కడ సోదాలు చేపట్టనుంది. ముఖ్యంగా డిసెంబర్ 30 , 31 తేదీలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. సిటీలోనే కాకుండా… చెక్ పోస్టుల వద్ద కూడా నిఘా పెంచనుంది.
సిటీ పోలీసుల వార్నింగ్:
ఇక నూతన సంవత్సర వేడుకల పేరుతో రోడ్లపై హంగామా సృష్టిస్తూ, హద్దు మీరితే కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు. తాగి వాహనాలు నడిపే వారిపై బుధవారం నుంచి న్యూ ఇయర్ రోజు వరకు నగరవ్యాప్తంగా స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు నగర సీపీ సజ్జనార్ వివరాలను వెల్లడించారు.
క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
{{/usCountry}}క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. హాట్ స్పాట్లు, గతంలో నేరాలు జరిగిన ప్రాంతాల్లో సిబ్బందిని మోహరించాలని, పాత నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
{{/usCountry}}డిసెంబరు 31 రాత్రి నగరవ్యాప్తంగా 100 ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని సీపీ తెలిపారు. ఇందుకోసం 7 ప్లాటూన్ల అదనపు బలగాలను రంగంలోకి దించుతున్నామన్నారు. కొత్త సంవత్సరం జోష్‌లో మోతాదు మించి తాగి వాహనాలు నడిపితే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహన సీజ్‌తో పాటు రూ.10 వేల జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు.