...
...
Next Story

రాముడు రిచ్.. శివుడు పూర్.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం!

శివుడు, రాముడిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.

Published on: Sep 29, 2026, 19:00:03 IST
Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లైన శ్రీరాముడు, పరమశివుడిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఆయన హిందువుల మధ్య, ఉత్తర-దక్షిణ భారత దేశాల మధ్య విభజన తెచ్చేందుకు కుట్ర పన్నుతున్నారని బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీలో జరిగిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఉత్తరాది రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించలేకపోవడానికి బీజేపీ ‘శ్రీరాముడిని దొంగిలించడమే’ కారణమని వ్యాఖ్యానించారు. ఉత్తరాదిలో శ్రీరాముడిని అత్యధికంగా పూజిస్తారని, అదే సమయంలో దక్షిణాదిలో పరమశివుడిని ఎక్కువగా పూజించడం వల్లే ఇక్కడ కాంగ్రెస్ గెలిచిందని పేర్కొన్నారు.

అంతటితో ఆగకుండా "శ్రీరాముడు సంపన్నుల దేవుడు.. పరమశివుడు పేదల దేవుడు" అని సంచలన వ్యాఖ్యలు చేశారు రేవంత్ రెడ్డి. బీజేపీ కేవలం ధనవంతుల పార్టీ అని, అందుకే శ్రీరాముడిని తమ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేయడం అత్యంత ఘోరం అని అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో సీఎం దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీజేపీ శ్రేణులకు రాంచందర్ రావు పిలుపునిచ్చారు.

గతంలో ముస్లింలను ఏకం చేసేందుకు రేవంత్ రెడ్డి తనను తాను రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకున్నారని, ఇప్పుడు హిందువులను విడదీసేందుకు దేవుళ్ల మధ్య వ్యత్యాసాలు చూపుతున్నారని రాంచందర్ ఆరోపించారు.

మరో బీజేపీ సీనియర్ నాయకుడు సయ్యద్ షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ.. దేవుళ్ల గురించి మాట్లాడుతున్నప్పుడు పదజాలం జాగ్రత్తగా వాడాలని, ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఈ వివాదంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలను సమర్థించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 'శ్రీరాముడు అనేక ఆభరణాలతో సంపన్నుడిగా కనిపిస్తారు. పరమశివుడు వస్త్రాలు కూడా లేకుంటే భౌతికంగా పేదవానిగా కనిపిస్తారు. రేవంత్ రెడ్డి చెప్పిన వ్యత్యాసం అదే. మాకు ఇద్దరు దేవుళ్ళు ఒక్కటే. మేం ఇద్దరినీ పూజిస్తాం. కానీ బీజేపీ మాత్రం ఓట్ల కోసం శ్రీరాముడి పేరుతో రాజకీయాలు చేస్తోంది.' అని మహేష్ కుమార్ గౌడ్ వివరణ ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks