...
...
Next Story

LPG Crisis : నో టీ, కాఫీ.. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి కట్.. హాస్టళ్లలో ఉండేవారికి వంట గ్యాస్ తిప్పలు

LPG Crisis : తెలంగాణలోని హాస్టళ్లపై వంట్ గ్యాస్ ప్రభావం చూపిస్తుంది. హాస్టళ్ల యజమానులు మెనూలో నుంచి కొన్ని రకాల ఆహార పదార్థలను కట్ చేస్తున్నారు.

Published on: Mar 11, 2026, 12:48:29 IST
Advertisement

తెలంగాణలోని హాస్టళ్లలో వంట గ్యాస్ కష్టాలు మెుదలయ్యాయి. మెుత్తం ఫీజు కడుతున్నా.. హాస్టళ్లలో ఉండేవారికి మీద ప్రభావం పడుతుంది. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరాలో కొరత కారణంగా హాస్టళ్లకు తాత్కాలికంగా టీ, కాఫీ అందించరాదని హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ హాస్టళ్ల సంఘం ప్రకటించింది. టిఫిన్లు, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనె వినియోగించే అల్పాహార వస్తువులను మెనూలో నుంచి తీసేయాలని తెలిపింది.

హాస్టళ్లలో కొన్ని బ్రేక్‌ఫాస్ట్‌లు కట్
హాస్టళ్లలో కొన్ని బ్రేక్‌ఫాస్ట్‌లు కట్

అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధం కొనసాగుతున్నందున అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. చపాతీ, దోసె, పూరీ, ఇతర సమయం తీసుకునే లేదా అధిక నూనెకు కారణం అయ్యే అల్పాహారం వస్తువులను మినహాయించాని అసోసియేషన్ పేర్కొంది. తాత్కాలికంగా టీ, కాఫీని అందించరాదని అసోసియేషన్ హాస్టళ్లకు పంపిన సందేశంలో స్పష్టం చేసింది. పరిస్థితి, కొరతను బట్టి కొన్ని కూరలు, అదనపు ఆహార పదార్థాలను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని తెలిపింది.

గ్యాస్ కొరత పరిస్థితి మెరుగుపడే వరకు బియ్యం, ఇతర ప్రాథమిక భోజనం వంటి ఆహార పదార్థాలు మాత్రమే అందిస్తారు. స్వయంగా వంట చేసుకునే సౌకర్యాలు తాత్కాలికంగా నిలిపివేశారు. 'అన్ని హాస్టల్ యజమానులు ప్రత్యామ్నాయ వంట పద్ధతులను అమలు చేయాలి. దయచేసి పరిస్థితి గురించి గెస్ట్‌లకు తెలియజేయాలని మేం అభ్యర్థిస్తున్నాం.' అని అసోసియేషన్ తెలిపింది.

గ్యాస్ సిలిండర్ కొరతను ఎదుర్కొంటున్నామని ఐటీ కారిడార్ హాస్టల్ అసోసియేషన్ వెల్లడించింది. గ్యాస్ వినియోగాన్ని తగ్గించడానికి, పరిస్థితిని నిర్వహించడానికి, పరిస్థితి మెరుగుపడే వరకు అన్ని హాస్టల్ యజమానులు మార్గదర్శకాలను పాటించాలని అభ్యర్థించింది.

మరోవైపు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా అందుబాటులోకి రాకపోతే ఒకటి లేదా రెండు రోజుల్లో 60 శాతానికి పైగా హోటళ్లు మూసివేయాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. తగినంత స్టాక్‌లు ఉన్న పెద్ద హోటళ్లు ఒక వారానికి సరిపడా నిర్వహించగలవు. కానీ చిన్నవి రెండు రోజుల్లోనే మూసివేయవలసి రావచ్చని తెలిపింది.

కమర్షియల్ ఎల్పీజీతో తెలంగాణలోని హోటళ్ల యజమానులు తమ కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల మధ్య వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల సరఫరా ఆలస్యం అయితే, ఒకటి లేదా రెండు రోజుల్లో రాష్ట్రంలో 60 శాతం కంటే ఎక్కువ హోటళ్ల కార్యకలాపాలను మూసివేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe