గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) రాష్ట్ర ప్రభుత్వం మూడుగా విభజించిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC), మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)గా విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా కార్పొరేషన్ల ఆఫీసులు కూడా కొలువుదీరటమే కాకుండా కమిషనర్లు కూడా బాధ్యతలు స్వీకరించారు.

జీహెచ్‌ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్) పునర్విభజనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్తగా మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ను ఏర్పాటు చేసింది. కొత్తగా ఏర్పాటైన ఈ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎన్ని వార్డులు..? ఎన్ని జోన్లు..? ఉన్నాయనే వివరాలను ఇక్కడ తెలుసుకోండి….
మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ - ముఖ్యమైన 10 పాయింట్లు :
- గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాలను వేరు చేసి మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)ని ఏర్పాటు చేశారు.
- జీహెచ్‌ఎంసీ చట్టం-1955, సెక్షన్-3(1) ప్రకారం ఎంఎంసీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
- మల్కాజిగిరి కార్పొరేషన్ (ఎంఎంసీ)లో మల్కాజిగిరి, ఎల్బీనగర్, ఉప్పల్ జోన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ పరిధిలో 14 సర్కిల్స్, 74 డివిజన్లు ఉన్నాయి.
- మల్కాజ్ గిరి కార్పొరేషన్ 654 చ.కి విస్తీర్ణంతో ఏర్పడింది. మొట్టమొదటి కమిషనర్ గా జీహెచ్‌ఎంసీ అడిషనల్ కమిషనర్, ఐఏఎస్ ఆఫీసర్ 2013 బ్యాచ్‌కు చెందిన టి. వినయ్ కృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఎఎస్ జయేష్ రంజన్ బాధ్యతలు చేపట్టారు.
- తార్నాకలో మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసును ఏర్పాటు చేశారు. మల్కాజ్ గిరి కార్పొరేషన్ లో మొత్తం 3 జోన్లు, 14 సర్కిళ్లు, 74 వార్డులున్నాయి.
- ఈ కార్పొరేషన్ లో ఉన్న మల్కాజ్ గిరి జోన్ కింద కీసర, అల్వాల్, బోయిన్ పల్లి, మౌలాలి, మల్కాజ్ గిరి జోన్లు ఉన్నాయి. మొత్తం 5 సర్కిళ్లు ఉండగా.... 26 వార్డులున్నాయి.
- ఉప్పల్ జోన్ కింద ఘట్ కీసర, కాప్రా, నాచారం, ఉప్పల్, బోడుప్పల్ సర్కిళ్లున్నాయి. వీటిల్లో 24 వార్డులున్నాయి.
- ఎల్బీ నగర్ జోన్ కింద నాగోల్, సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ సర్కిళ్లు ఉన్నాయి. వీటిల్లో 24 వార్డులున్నాయి.
- మల్కాజ్ గిరి కార్పొరేషన్ లో భాగమైన మల్కాజ్ గిరి జోన్ లోనే అత్యధికంగా 26 వార్డులున్నాయి.
- నగర విస్తరణ, జనాభా పెరుగుదల మరియు పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హైదరాబాద్ నగరాభివృద్ధికి దోహదపడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక ప్రస్తుత జీహెచ్‌ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతోంది. కొత్తగా సైబరాబాద్ తో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్‌ఎంసీ కొనసాగనుంది.కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
{{/usCountry}}ఇక ప్రస్తుత జీహెచ్‌ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ యథావిధిగా కొనసాగుతోంది. కొత్తగా సైబరాబాద్ తో పాటు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్లు అందుబాటులోకి వచ్చాయి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, చార్మినార్, రాజేంద్రనగర్, శంషాబాద్ జోన్లతో జీహెచ్‌ఎంసీ కొనసాగనుంది.కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ జోన్లను కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
{{/usCountry}}