భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్ లోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 80 పోస్టులున్నాయి. ఈ పోస్టుల భర్తీ కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువు దగ్గరపడింది.

{{^htLoading}} {{/htLoading}}
అర్హులైన అభ్యర్థులు రేపటి లోపు (డిసెంబర్ 29) అప్లయ్ చేసుకోవచ్చు. అది కూడా సాయంత్రం 4 గంటలలోపు వరకే ఛాన్స్ ఉంటుంది. https://online.cbexams.com/ లింక్ తో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
మొత్తం 9 విభాగాల్లో 80 ఖాళీలుండగా… రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ. నెలకు రూ.40,000 - రూ.1,40,000 జీతం చెల్లిస్తారు.
బీడీఎల్, హైదరాబాద్ నోటిఫికేషన్ వివరాలు:
- ఉద్యోగ ప్రకటన - భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్), హైదరాబాద్
- ఉద్యోగ ఖాళీలు -మేనేజ్‌మెంట్ ట్రెయినీ
- మొత్తం ఖాళీలు - 80
- విభాగాలు - ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, సివిల్, ఫైనాన్స్, హ్యుమన్ రిసోర్సెస్
- అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 55 నుంచి 60 శాతం మార్కులతో డిగ్రీ ఉండాలి. పూర్తి వివరాలను https://bdl-india.in/recruitments వెబ్ సైట్ లో చూడొచ్చు.
- దరఖాస్తు విధానం - ఆన్ లైన్
- దరఖాస్తులకు తుది గడువు - 29 డిసెంబర్ 2025
- నెల జీతం - రూ. 40,000 - రూ. 1,40,000
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
- కంప్యూటర్ బేస్డ్ పరీక్ష 2 గంటలు ఉంటుంది. ఇందులో నుంచి 85 శాతం వెయిటేజీ ఇస్తారు. మిగతా 15 శాతం ఇంటర్వ్యూకు కేటాయిస్తారు.
- పరీక్షా కేంద్రాలు - హైదరాబాద్, విజయవాడతో పాటు అహ్మాదాబాద్, గాంధీనగర్, బెంగళూర్, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, కోల్ కత్తా, లక్నో, ముంబై, త్రివేండ్రం
- అధికారిక వెబ్ సైట్ - https://bdl-india.in/recruitments
{{^htLoading}} {{/htLoading}}
ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తు ప్రాసెస్ చేసుకోవచ్చు
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}