మంచిర్యాల జిల్లా నస్పూర్ సమీపంలోని నస్పూర్ గేట్ ఏరియా జాతీయ రహదారిపై ఆటో లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు మందమర్రి మండలం గుడిపల్లి, పొన్నారం గ్రామస్తులుగా గుర్తించారు.

ఆటోలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తుండగా లారీ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైంది ఆటో. మృతిచెందినవారు సౌందర్య, రమ్య, రవళి.. ముగ్గురు యువతులు మంచిర్యాలలో ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్నారు. రోజులాగే ఉదయం విధుల్లోకి వెళ్లడానికి ఆటోలో బయల్దేరుతారు. మార్గమధ్యంలో నస్పూర్ వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది.
ఆటోకు బైక్ అడ్డు వచ్చింది. బైక్‌ను తప్పించే ప్రయత్నం చేశాడు ఆటో డ్రైవర్. వాహనాన్ని పక్కకు తిప్పాడు. ఎదురుగా వస్తున్న లారీని ఆటో బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అయింది. ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
బోల్తా పడిన ప్రైవేట్ బస్సు
జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. మానవపాడు మండలానికి చెందిన బోరవెల్లి సమీపంలో అత్యంత వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో పాఠశాల విద్యార్థులు ఉన్నప్పటికీ, అదృష్టవశాత్తూ ఎవరికీ తీవ్ర గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పి ఊపిరి పీల్చుకున్నారు.
బస్సులో ప్రయాణిస్తున్న వారంతా తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతానికి చెందిన 'హోలీక్రాస్ ఇంటర్నేషనల్ స్కూల్' విద్యార్థులు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులందరినీ సురక్షితంగా బయటకు తీసి, ప్రత్యామ్నాయంగా ఆర్టీసీ బస్సును ఏర్పాటు చేసి కర్నూలు వైపు పంపించారు.
అడిషనల్ కలెక్టర్‌కు తప్పిన ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. అడిషనల్ కలెక్టర్ ధార వేణుగోపాల్ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి భద్రాద్రి వస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనం అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్‌ను మరో వాహనంలో భద్రాద్రికి తరలించారు.
{{/usCountry}}భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ కలెక్టర్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. అడిషనల్ కలెక్టర్ ధార వేణుగోపాల్ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ నుంచి భద్రాద్రి వస్తున్నారు. ఈ క్రమంలో నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి కామినేని హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారిపై వాహనం అదుపుతప్పి ముందుగా వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి అడిషనల్ కలెక్టర్ వేణుగోపాల్ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్‌ను మరో వాహనంలో భద్రాద్రికి తరలించారు.
{{/usCountry}}