Hyderabad : హైదరాబాద్‌లో అమ్మాయి ముందు హస్తప్రయోగం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్?
Hyderabad : హైదరాబాద్ నగరంలో ఓ యువతికి ఘోరమైన ఘటన ఎదురైంది. ఉదయం పూట రన్నింగ్ చేస్తున్న సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆమె ముందు అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.
మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం గురించి మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోకాపేట్ నర్సింగి సైకిల్ ట్రాక్ దగ్గర ఉదయం రన్నింగ్‌కు వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది.

ఏప్రిల్ 26న తెల్లవారుజామున తాను రన్నింగ్ కోసం వెళ్లినప్పుడు బహిరంగంగా ఒక వ్యక్తి హస్తప్రయోగం చేసుకున్నాడని హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఆరోపించింది. తాను పరుగెడుతున్నప్పుడు ఆ వ్యక్తి హస్తప్రయోగం చేసుకుంటుండటాన్ని గమనించినట్లు వెల్లడించింది. ఈ సంఘటన తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఆ తర్వాత ఫిర్యాదు చేయడానికి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించానని చెప్పింది.
ఈ సంఘటన ఉదయం 6:20 గంటల ప్రాంతంలో, కోకాపేట్ నర్సింగి సైకిల్ ట్రాక్ ప్రవేశ ద్వారం, సైకిల్ అద్దె పాయింట్ మధ్య జరిగింది. మహిళ ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె ఆ వ్యక్తి వెనుక వైపు నుంచి మాత్రమే చిత్రీకరించగలిగింది.
'ఈ వ్యక్తి సైకిల్ ట్రాక్‌పైనే హస్తప్రయోగం చేసుకుంటున్నాడు. అక్కడ చాలా రద్దీగా ఉంటుంది. మీరు హైదరాబాద్ వాసులైతే, ఈ సైక్లింగ్ ట్రాక్ ఎంత రద్దీగా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది, నా కెమెరాతో రెండు సెకన్లు ముందుగా తెరుచుకుని ఉంటే, నేను అతని ముఖాన్ని చూపించగలిగేదాన్ని.' అని ఆమె చెప్పుకొచ్చింది.
పొద్దున్నే సైకిల్ ట్రాక్ రద్దీగా ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం తాను చూశానని మహిళ తెలిపింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న తన ఎఫ్‌ఐఆర్ లేఖ కాపీలో, ఆ హైదరాబాద్ మహిళ అనుమానితుడిని సుమారు 29-30 ఏళ్ల వయస్సు గల, నల్లటి ఛాయ, ఉంగరాల జుట్టు ఉన్న వ్యక్తిగా వర్ణించారు.
'అన్ని వయసుల వారు పరుగెడుతూ, సైకిల్ తొక్కుతూ ఉన్నారు, ట్రాక్‌పై పిల్లలు కూడా ఉన్నారు. నేను కాస్త షాక్ అయ్యాను, కాబట్టి, ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరైనా చూశారో నాకు గుర్తులేదు, కానీ ట్రాక్‌పై మాత్రం జనాలు కనిపించారు. అతను ప్రత్యేకంగా నన్నే లక్ష్యంగా చేసుకున్నాడని నేను అనుకోవడం లేదు. అక్కడి నుంచి వెళ్లే ఏ ఇతర మహిళ/పిల్లలకైనా అతను అలాగే చేసి ఉండేవాడు.' అని మహిళ హిందుస్థాన్‌టైమ్స్‌తో తెలిపింది.
ఈ సంఘటన తన మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపిందని తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఆ వ్యక్తి తనను చూసినప్పుడు అసభ్యకరమైన హావభావాలు ప్రదర్శించాడని, అదే సమయంలో తన పురుషాంగాన్ని తాకుతూనే ఉన్నాడని ఆమె వివరించింది. ఆమె తన కెమెరాను బయటకు తీయగానే అతను ముఖం తిప్పుకున్నాడు.
'2026 ఏప్రిల్ 26వ తేదీన ఉదయం 5:50 గంటలకు నేను రన్నింగ్ కోసం నర్సింగి-కోకాపేట్ సైకిల్ ట్రాక్ ప్రవేశ ద్వారం వద్దకు ఉబెర్ ఆటోలో వెళ్ళాను. దాదాపు 2 కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత.. ఉదయం 6:18 గంటల ప్రాంతంలో ట్రాక్ వైపు తిరిగి హస్తప్రయోగం చేసుకుంటున్న ఒక అపరిచితుడిని చూశాను. అతను మధ్యస్థంగా (సుమారు 5'5 అడుగుల ఎత్తు), నల్లటి ఛాయతో, ఉంగరాల జుట్టుతో ఉన్నాడు.
ఆ సంఘటన నా మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ముద్ర వేసింది. నేను రికార్డ్ చేయడానికి నా జేబులోంచి ఫోన్ తీసినప్పుడు, అతను తన జననాంగాలను కప్పుకోవడానికి మాత్రమే ప్యాంటు పైకి లాగాడు. అతను మోకాళ్ల వరకు ఉండే నల్లని ఆకులు ప్రింట్ ఉన్న షార్ట్స్, బూడిద రంగు పోలో షర్ట్ ధరించి ఉన్నాడు. ఇది HPS-852 మార్కింగ్ ఉన్న పోల్ పక్కనే ఉంది. సంఘటన జరిగిన ప్రదేశానికి సుమారు 300-400 మీటర్ల దూరంలో సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి.' అని మహిళ ఎఫ్‌ఐఆర్ లేఖలో పేర్కొంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


