మేడారం సమ్మక్క - సారక్క జాతర ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో దేవదాయశాఖ హుండీ లెక్కింపు ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేసింది. ఈ లెక్కింపును రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ప్రారంభించారు.
10 రోజులపాటు లెక్కింపు…!

దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మొత్తం 500 మంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపడుతున్నారు. మొత్తం 788 హుండీలలోని కానుకలు లెక్కిస్తారు. గత జాతరలో 540 హుండీలు పెట్టగా 13.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ధపా అంతకన్నా ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని దేవదాయ అధికారులు తెలిపారు.
సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూ వస్తోంది. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. 2018లో రూ. 8.14 కోట్ల ఆదాయం రాగా… 2020లో రూ. 9.87 కోట్లు, 2022లో రూ. 12.45 కోట్ల ఆదాయం వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. 2024 జాతరలో రూ.13 కోట్ల మేర ఆదాయం రాగా.. ఈసారి మరింత ఎక్కువగా రావొచ్చని అంచనా వేస్తున్నారు.
మరోవైపు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా గద్దెల విస్తరణ చేపట్టడంతో… మేడారం రూపురేఖలు మారిపోయాయి. శాశ్వత ప్రతిపాదికన రోడ్ల నిర్మాణంతో పాటు మరికొన్ని పనులు చేపట్టారు. ఫలితంగా గతంతో పోల్చితే మేడారంలో చాలా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.
జనవరి 28 నుంచి జనవరి 31 వరకు మహాజాతర అత్యంత వైభవంగా జరిగింది. మేడారం మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి భారీ సంఖ్యలో పెరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత కూడా… భక్తులు తరలివస్తూ దర్శనం చేసుకుంటున్నారు.
{{/usCountry}}జనవరి 28 నుంచి జనవరి 31 వరకు మహాజాతర అత్యంత వైభవంగా జరిగింది. మేడారం మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల తాకిడి భారీ సంఖ్యలో పెరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత కూడా… భక్తులు తరలివస్తూ దర్శనం చేసుకుంటున్నారు.
{{/usCountry}}