...
...
Next Story

Mee Seva Charges Hike : తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో పెరిగిన ధరలు.. ఏ సర్టిఫికెట్‌కు ఎంత?

Meeseva Charges Hike : తెలంగాణలో మీ సేవ కేంద్రాల్లో సర్వీస్ ధరలను పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి జీవో జారీ అయింది. ఏ సర్టిఫికెట్‌కు ఎంత పెరిగిందో చూడండి.

Published on: Apr 1, 2026, 17:50:26 IST
Advertisement

తెలంగాణలో పలు రకాల సర్టిఫికెట్లను మీ సేవ ద్వారా పొందవచ్చు. ఈ సర్వీస్ ద్వారా జనాలు మీ సేవకు వెళ్లి కావాల్సిన పత్రాలను అప్లై చేసుకుంటున్నారు. ఇందుకుగానూ ఛార్జీలను వసూలు చేస్తాయి మీ సేవ కేంద్రాలు. తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మీ సేవ కేంద్రాల్లో సర్వీసుల ధరలను పెంచింది. దీంతో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఇక నుంచి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.

మీ సేవ కేంద్రాల్లో పెరిగిన ధరలు
మీ సేవ కేంద్రాల్లో పెరిగిన ధరలు

జీవో ప్రకారం.. మీ సేవలో అన్ని సర్వీసులపై 50 శాతం ధరలు పెంచారు. ఆదాయ, కుల, స్థానికత లాంటి సర్టిఫికెట్లు జారీ చేయడానికి రూ.80 రుసుం చేశారు. అలాగే జనన ధ్రువీకరణ పత్రం రుసుం రూ.62 చేశారు.

మీ సేవ సర్వీసుల ఛార్జీలు ఏప్రిల్ 1 నుండి అధికారికంగా అమలులోకి వస్తాయి. సుమారు ఎనిమిదేళ్లలో మీసేవా ఫీజు విధానాన్ని నవీకరించడం ఇదే మొదటిసారి. చివరి సవరణ 2018-19లో జరిగింది.

  • కేటగిరీ ఎ (ప్రాథమిక సర్టిఫికెట్లు) ఇప్పుడు రూ. 62కి పెంచారు.
  • కేటగిరీ బి (ప్రధాన సర్టిఫికెట్లు/దరఖాస్తులు) ఇప్పుడు రూ. 80 చేశారు.

ప్రభుత్వం అత్యంత తరచుగా ఉపయోగించే ప్రజా సేవల ఖర్చులను క్రమబద్ధీకరించింది. ఈ పాస్ బయోమెట్రిక్‌కు రూ. 35, రైతు నమోదు రుసుము రూ.18గా ఉన్నాయి. ఆహార భద్రతా కార్డు దరఖాస్తులు/సవరణలు: రుసుము స్థిరంగా రూ. 80గా నిర్ణయించారు. ఆర్టీఏ డీఎల్ ఫీజు చెల్లింపులు, ఎల్ఎల్ఆర్ స్లాట్ బుకింగ్: రూ. 62కి సవరించారు.

ప్రింటింగ్/స్కానింగ్ ఛార్జీలు: ఒక లావాదేవీలోని మొదటి నాలుగు పేజీలకు మించి అవసరమయ్యే ఏ స్కానింగ్ లేదా ప్రింటింగ్‌కైనా, ప్రతి పేజీకి రూ. 2.50 రుసుము వర్తిస్తుంది. విద్యుత్ బిల్లు చెల్లింపులు (TGSPDCL/TGNPCL) ఇప్పుడు బిల్లు మొత్తం ఆధారంగా పైన ఛార్జీలు వసూలు చేస్తారు.

  • రూ. 200 వరకు: రూ. 4
  • రూ. 201 – రూ. 1,000: రూ. 9
  • రూ. 1,001 – రూ. 2,500: రూ. 18
  • రూ. 2,500 పైన: రూ. 44

అయితే విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందు విద్యార్థులు క్యాస్ట్, ఇన్‌‌కమ్ సర్టిఫికేట్లు చేయించుకుంటారు. ఇలాంటి సమయంలో ధరలు పెంచడంపై సామాన్యులపై భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

పెరిగిన మీ సేవ ఛార్జీలు
 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe