Telangana Mee Ticket App : 'మీ టికెట్'యాప్ తో క్యూ లైన్ కష్టాలకు చెక్ - ఇక అంతా స్మార్ట్‌గానే..! ఈ సేవలన్నీ పొందొచ్చు

Mee Ticket App Telangana : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'మీ టికెట్' (Mee Ticket) యాప్ ఇప్పుడు పౌరుల నిత్య జీవితాన్ని సులభతరం చేస్తోంది. మెట్రో, బస్ ప్రయాణాలతో పాటు పర్యాటక ప్రాంతాల టికెట్లను ఇకపై మీ అరచేతి నుంచే బుక్ చేసుకోవచ్చు.

Published on: Apr 24, 2026 6:32 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వేసవికాలం కావటంతో…. సెలవుల సీజన్ నడుస్తోంది. ఈ వీకెండ్‌లో సరదాగా ఫ్యామిలీతో కలిసి మెట్రోలో షికారు చేయాలన్నా, ఏదైనా ప్రముఖ ఆలయాన్ని సందర్శించాలన్నా, లేక పిల్లలతో కలిసి పార్కులు, మ్యూజియంలు, గోల్కొండ కోట వంటి చారిత్రక కట్టడాలను చూడాలనుకున్నా అందరికీ గుర్తొచ్చే మొదటి సమస్య ‘క్యూ లైన్లు’…! ఎండ తీవ్రతలో టికెట్ కౌంటర్ల దగ్గర గంటల తరబడి నిరీక్షించడం ఎంతో విసుగును కలిగిస్తుంది. కానీ ఇకపై ఆ చింత అక్కర్లేదు. మీ స్మార్ట్ ఫోన్‌లో ఒక్క క్లిక్ చేస్తే చాలు.. మీ వీకెండ్ ప్లాన్ మొత్తం సాఫీగా సాగిపోతుంది.

మీ టికెట్ యాప్ ద్వారా సరళమైన సేవలు
మీ టికెట్ యాప్ ద్వారా సరళమైన సేవలు

రాష్ట్ర ఐటీ శాఖ పరిధిలోని 'మీ సేవా' (Mee Seva) విభాగం ప్రవేశపెట్టిన మీ టికెట్ (Mee Ticket) యాప్ ఇప్పుడు పౌర సేవల్లో విప్లవాత్మక మార్పులు తెస్తోంది. "టికెట్ ఏదైనా - యాప్ ఒక్కటే" అనే నినాదంతో వస్తున్న ఈ అప్లికేషన్ ద్వారా ఇంటి నుంచే వివిధ రకాల టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు కలుగుతోంది.

ఒకే యాప్.. ఎన్నో సేవలు

ఈ యాప్ కేవలం ప్రయాణాలకే పరిమితం కాలేదు. ఆర్టీసీ, అధ్యాత్మికం, టూరిజంతో పాటు అనేక రకాల సేవలు అందుబాటులో ఉంటాయి.

  • ప్రయాణ సౌకర్యాలు: మెట్రో రైల్ టికెట్లు, ఆర్టీసీ బస్సు ప్రయాణ టికెట్లు.
  • పర్యాటక ప్రాంతాలు: పార్కులు, మ్యూజియంలు, గోల్కొండ ఫోర్ట్ వంటి చారిత్రక ప్రదేశాల ప్రవేశ టికెట్లు.
  • ఆధ్యాత్మికం - వినోదం: ప్రముఖ టెంపుల్ విజిట్స్, జూ పార్క్, ఫారెస్ట్ సఫారీ టికెట్లు.
  • ఈవీ ఛార్జింగ్: ఎలక్ట్రిక్ కారులో ప్రయాణిస్తుంటే… మీకు సమీపంలో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ల లొకేషన్లను కూడా ఈ యాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.

అనూహ్య స్పందన…..

ప్రవేశపెట్టిన అనతి కాలంలోనే 'మీ టికెట్' యాప్ ప్రజలకు చేరువయ్యింది. ప్రభుత్వం తెలిపిన గణాంకాల ప్రకారం… ఇప్పటివరకు సుమారు 2.5 లక్షల మంది పౌరులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. 6 లక్షలకు పైగా సేవలను ప్రజలు ఈ యాప్ ద్వారా వినియోగించుకున్నారు. సురక్షితమైన పద్ధతిలో దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా విలువైన లావాదేవీలు జరిగాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని 219 లోకేషన్లలో ఈ యాప్ సేవలు అందుబాటులో ఉన్నాయి.

మరిన్ని సేవలు తీసుకువస్తాం: ఐటీ మంత్రి శ్రీధర్ బాబు

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ యాప్ పనితీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఐటీ సేవలను ప్రజల నిత్య జీవితంలో మరింత భాగం చేయడమే లక్ష్యమని, త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని విభాగాలను ఈ యాప్ పరిధిలోకి తీసుకువస్తామని చెప్పారు

మీ- సేవా కమిషనర్ టీ. రవి కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలు ఎండలో క్యూ లైన్లలో నిలబడి ఇబ్బంది పడకుండా, సౌకర్యవంతంగా తమ పర్యటనలను ప్లాన్ చేసుకోవడానికి 'మీ టికెట్' యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని స్మార్ట్ డిజిటల్ సేవలను అనుభవించాలని కోరారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More