హైదరాబాద్ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జ్ పైకప్పు నుంచి ఒక పెద్ద మెటల్ ప్యానెల్ కిందపడింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుడి తలపై పడటంతో, అతనికి అంతర్గత గాయాలై, తల తిరుగుతున్నట్లుగా ఫీలయ్యాడు. పని నిమిత్తం భారతదేశానికి వచ్చాడు అమెరికా పౌరుడు దీపక్ అడోని. బెంగళూరు నుంచి వచ్చిన విమానం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులలో తాను కూడా ఒకడినని పీటీఐకి తెలిపాడు.

'నేను కొన్ని అడుగులు వేయగానే ఆ బరువైన ప్యానెల్ నా తలపై పడింది. నన్ను ఏది తాకిందో తెలియక నిల్చోవడానికి రెయిలింగ్‌ను పట్టుకున్నాను.' అని 63 ఏళ్ల అడోని చెప్పారు.
అడోని ఏరోబ్రిడ్జ్ గోడకు ఆనుకుని ఉండగా, అతని వెనుక ఉన్న జైనాబ్ సయ్యద్ అనే యువతి సహాయం కోసం పరుగెత్తుకొచ్చి, కేకలు వేసింది. సుమారు 30 నిమిషాల తర్వాత అడోనిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్యుని నివేదిక ప్రకారం సీటీ స్కాన్‌లో మెడ వెన్నెముకలో మార్పులు గుర్తించారు. అంతేకాదు.. డిస్క్‌లో ఉబ్బులు, తలకు గాయం ఉన్నట్లు తేలింది.
అయితే వెన్నెముక సమస్య ముందు నుంచే ఉన్నదా లేక జరిగిన ప్రమాదం వల్ల వచ్చిందా అనేది స్పష్టంగా తెలియలేదు. 'మొదట్లో నేను బాగానే ఉన్నాను, కానీ 30 నిమిషాల్లోనే నాకు కళ్లు తిరగడం మొదలైంది, అంతేకాకుండా నేను నత్తిగా మాట్లాడటం మొదలుపెట్టాను. జైనాబ్ నాతో పాటు అంబులెన్స్‌లో ప్రయాణించి, అమెరికాలో ఉన్న నా భార్యతో మాట్లాడటానికి సమయం కేటాయించింది. ఆమె మంచి మనిషి.' అని అడోని చెప్పాడు.
ఆసుపత్రిలో వైద్యులు సీటీ స్కాన్‌తోపాటు ఎంఆర్ఐ కూడా నిర్వహించారు. ఆ ప్రక్రియ అంతా జరుగుతున్నప్పుడు తాను నిలబడలేకపోయానని వెల్లడించాడు అడోని. అక్కడ ఉన్నవారు తనకు సహాయం చేయాల్సి వచ్చిందన్నారు. ఒకానొక సమయంలో తాను కూర్చున్నప్పుడు గది మొత్తం తిరుగుతున్నట్టుగా ఫీలయ్యానని చెప్పుకొచ్చాడు.
సుమారు 7-8 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉన్న అల్యూమినియం ప్యానెల్ ఊడిపోయి కింద పడటానికి కారణం ఏంటో తెలియరాలేదు. సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు హైదరాబాద్ విమానాశ్రయ అధికారి ఒకరు తనతో పాటే ఉన్నారని చెప్పారు.
{{/usCountry}}సుమారు 7-8 అడుగుల పొడవు, 2 అడుగుల వెడల్పు ఉన్న అల్యూమినియం ప్యానెల్ ఊడిపోయి కింద పడటానికి కారణం ఏంటో తెలియరాలేదు. సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు హైదరాబాద్ విమానాశ్రయ అధికారి ఒకరు తనతో పాటే ఉన్నారని చెప్పారు.
{{/usCountry}}వైద్యులు అతనికి మెడ పట్టీ ధరించమని సలహా ఇచ్చాడు. మెడ, తలనొప్పికి నొప్పి నివారణ మందులను ఇచ్చారు. తాను వెంటనే అమెరికాకు తిరిగి వెళ్లనని, తన పరిస్థితిపై ఒక అంచనా వచ్చిన తర్వాత వెళ్తానని అడోని అన్నాడు.
ఈ దురదృష్టకర సంఘటన పట్ల తాము తీవ్రంగా చింతిస్తున్నామని విమానాశ్రయ అధికారులు తెలిపారు. అడోనికి తీవ్రమైన లేదా పెద్ద గాయాలు ఏమీ కాలేదని కూడా వారు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నివారించడానికి విమానాశ్రయ నిర్వహణ బృందాలు ఏరోబ్రిడ్జ్ పైకప్పు ప్యానెళ్ల భద్రతా తనిఖీ నిర్వహించాయని ఒక ప్రకటన తెలిపింది.
విమానాశ్రయ అధికారులు, అత్యవసర వైద్య బృందాలు ప్రయాణికుడు దీపక్ అడోనికి వెంటనే చికిత్స అందించారని అధికారులు వెల్లడించారు. అవసరమైన అన్ని పరిశీలనలు, పరీక్షలు పూర్తి చేసిన తర్వాత కోలుకున్నాడని నిర్ధారించి, డిశ్చార్జ్ చేశారు.