బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన సుస్పష్ట అల్పపీడనం శనివారం ఉదయం 8:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.
తుఫానుగా బలపడే అవకాశం

అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం….. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత మరింత వేగం పుంజుకుని ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 16 సాయంత్రం సమయానికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.
ఐదు రోజులు పొడి వాతావరణం.. ఆ తర్వాత వర్షాలు
మరోవైపు…. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం…. నవంబర్ నవంబర్ 19 ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుంది.
రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని…. ఈ ఐదు రోజుల పాటు ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ప్రభావం నవంబర్ 19 తర్వాత తెలంగాణపై పడనుంది.
నవంబర్ 19 ఉదయం 8:30 గంటల నుంచి నవంబర్ 21 ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం వరి కోతలు, పత్తి ఏరివేత పనుల్లో ఉన్న రైతులు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
{{/usCountry}}నవంబర్ 19 ఉదయం 8:30 గంటల నుంచి నవంబర్ 21 ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం వరి కోతలు, పత్తి ఏరివేత పనుల్లో ఉన్న రైతులు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
{{/usCountry}}