తెలంగాణకు వాతావరణశాఖ అలర్ట్ - ఈనెల 19 నుంచి వర్షాలు..!

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నవంబర్ 16 సాయంత్రం నాటికి తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో తెలంగాణలో నవంబర్ 19 నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

Published on: Nov 14, 2026, 16:36:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

బంగాళాఖాతంలో మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన సుస్పష్ట అల్పపీడనం శనివారం ఉదయం 8:30 గంటల సమయానికి అదే ప్రాంతంలో స్థిరంగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తన తాజా బులెటిన్‌లో వెల్లడించింది.

తెలంగాణకు వర్ష సూచన
తెలంగాణకు వర్ష సూచన

తుఫానుగా బలపడే అవకాశం

అమరావతి వాతావరణ కేంద్రం అంచనాల ప్రకారం….. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్న సుస్పష్ట అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ రాబోయే 24 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత మరింత వేగం పుంజుకుని ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ నవంబర్ 16 సాయంత్రం సమయానికి దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు.

ఐదు రోజులు పొడి వాతావరణం.. ఆ తర్వాత వర్షాలు

మరోవైపు…. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం…. నవంబర్ నవంబర్ 19 ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగుతుంది.

రాబోయే రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని…. ఈ ఐదు రోజుల పాటు ఎలాంటి వాతావరణ హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది. అయితే, బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను ప్రభావం నవంబర్ 19 తర్వాత తెలంగాణపై పడనుంది.

నవంబర్ 19 ఉదయం 8:30 గంటల నుంచి నవంబర్ 21 ఉదయం 8:30 గంటల వరకు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం వరి కోతలు, పత్తి ఏరివేత పనుల్లో ఉన్న రైతులు వాతావరణ మార్పులను గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More