...
...
Next Story

దాదాపు ప్రతి 4 నిమిషాలకో మెట్రో ట్రైన్​.. ఆర్టీసీ సమ్మె కారణంగా సర్వీసులు పెంపు

Hyderabad Metro : తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం మెట్సో సర్వీసులను పెంచేలా చర్యలు తీసుకున్నది.

Published on: Apr 22, 2026, 14:06:15 IST
Advertisement

హైదరాబాద్ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తమ సర్వీసులను పెంపుతున్నట్లు మెట్రో ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్ మార్గంలో 4 నిమిషాలకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు తెలిపింది. నాగోల్-రాయదుర్గం మార్గంలో 3 నిమిషాల 40 సెకన్లకో మెట్రో ట్రైన్ నడుపుతున్నట్లు మెట్రో అధికారులు ప్రకటించారు.

  • మియాపూర్ - ఎల్బీ నగర్ కారిడార్‌లో సాధారణంగా పీక్ అవర్స్‌లో 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు, నాన్-పీక్‌లో 4 నిమిషాల 50 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 4 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలుగా ఉంటుంది.
  • నాగోల్-రాయదుర్గ్ కారిడార్‌లో సాధారణంగా నాన్-పీక్‌లో 5 నిమిషాల 20 సెకన్లకు ఒక రైలు. ఇప్పుడు రోజంతా 3 నిమిషాల 40 సెకన్లకు ఒక రైలు ఉంటుంది.
  • సాధారణంగా వారపు రోజుల్లో ఉదయం 8 నుండి 10:30 వరకు, సాయంత్రం 5 నుండి 8 వరకు మాత్రమే 56 రైళ్లు నడిపేవారు. నాన్-పీక్ అవర్స్‌లో 44 రైళ్లకు తగ్గించేవారు. సమ్మె కారణంగా ఇప్పుడు ఆ తగ్గింపు ఉండదు.
  • ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రాత్రి 11 గంటల తర్వాత కూడా మెట్రో సర్వీసులు పొడిగించే అవకాశాన్ని మెట్రో అధికారులు పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ మెట్రో
హైదరాబాద్ మెట్రో

మరోవైపు బుధవారం (ఏప్రిల్ 22, 2026) ఉదయం నుండి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు సర్వీసుల్లో భారీ అంతరాయాలు ఏర్పడ్డాయి. ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగడమే ఇందుకు కారణం. వేతన సవరణలో జాప్యం, ఇతర ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలను ప్రస్తావిస్తూ, తమను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన విధంగా చూడాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేశారు.

కొన్ని రోజులు TGSRTC కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ ఆందోళన ప్రారంభానికి ముందుగానే సమ్మె నోటీసు జారీ చేశారు. మంగళవారం రాత్రి అధికారులతో జరిగిన చర్చలు విఫలమవడంతో, విధులను బహిష్కరించడమే తమకు మిగిలిన ఏకైక ప్రత్యామ్నాయమని యూనియన్లు తెలిపాయి.

బస్సులు రోడ్ల పైకి రాకుండా ఆయా డిపోలకే పరిమితం కావడంతో, ప్రయాణికులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బస్సు స్టాప్‌లన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారగా, మహాత్మా గాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్ స్టేషన్ వంటి ప్రధాన బస్ స్టేషన్లలో కూడా ప్రయాణికుల రద్దీ చాలా తక్కువగా కనిపించింది. TGSRTC బస్సులు అందుబాటులో లేకపోవడంతో, ప్రజలు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks