...
...
Next Story

Karimnagar Mayor Seat : ‘16వ తేదీన ఏమవుతుందో చూద్దాం’ - మేయర్ పీఠంపై మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు

కరీంనగర్ మేయర్ పీఠం కాక రేపుతోంది. తామే కైవసం చేసుకోబోతున్నట్లు బీజేపీ ప్రకటించగా… తాము కూడా రేసులో ఉన్నామనే సంకేతాలను కాంగ్రెస్ ఇచ్చింది. ఇదే అంశంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published on: Feb 15, 2026, 11:49:12 IST
Advertisement

కరీంనగర్ మేయర్ పీఠం ఎవరికి దక్కబోతుందనేది ఉత్కంఠను రేపుతోంది. ఓవైపు తామే మెజార్టీ స్థానాలను గెలుచుకున్నామని చెబుతున్న బీజేపీ… మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. వారికి వచ్చిన సీట్లే కాకుండా… మరో నలుగురిని పార్టీలోకి తీసుకోగా… కావాల్సిన మద్దతుని కూడగట్టుకున్నామని ఎంపీ బండి సంజయ్ కూడా ప్రకటించారు. అయితే బీజేపీకి బ్రేకులు వేసే దిశగా కాంగ్రెస్ కూడా పావులు కదుపుతోంది. తాము కూడా రేసులో ఉన్నామని చెబుతోంది.

బీజేపీకి మెజార్టీ లేదు - మంత్రి పొన్నం

మంత్రి పొన్నం
మంత్రి పొన్నం

కరీంనగర్ మేయర్ పీఠంపై ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో మాదిరిగానే కరీంనగర్ లో కూడా బీజేపీకి మెజారిటీ లేదన్నారు. 16వ తేదీన ఏం జరుగుతుందో చూద్దామంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

నిజామాబాద్ మాదిరిగానే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ కి మెజారిటీ లేదని మంత్రి పొన్నం చెప్పారు. “నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 60 సీట్లు ఉన్నాయి.. 28 సీట్లతో బీజేపీ ఉంది.. అక్కడ పార్లమెంట్ సభ్యుడు మెజారిటీ లేదని ప్రతిపక్షం లో కూర్చుంటామని అన్నారు. కాంగ్రెస్ మిగతా పార్టీలు అన్ని గెలిచాయి. అక్కడ ఏమవుతుందని భవిషత్ నిర్ణయిస్తుంది. కరీంనగర్ లో మొత్తం 69 సభ్యులకు బీజేపీ కి 30 ఉన్నాయి. కానీ మేయర్ అవుతామని బండి సంజయ్ ప్రకటించుకున్నారు. బండి సంజయ్ మాదిరిగానే మిగతా పార్టీలకు కూడా వ్యూహాలు ఉంటాయి” అని మంత్రి పొన్నం చెప్పుకొచ్చారు.

“రాజకీయ పార్టీ గా గతంలో మేము 13 సీట్లు గెలిచినప్పుడు కూడా కరీంనగర్ లో మేయర్ అయ్యాం. ఇప్పుడు కూడా అన్ని రాజకీయ పార్టీల నాయకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సలహా సూచనల మేరకు వ్యవహరిస్తాం. ముఖ్యమంత్రి మంత్రుల జోక్యం లేదు. స్థానికంగా గెలిచిన ప్రజా ప్రతినిధులు వారి ఆలోచనకనుగుణంగా వ్యవహరిస్తాం” అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

“మా పార్టీకి సంబంధించి సమన్వయం చేసుకున్నప్పుడు వారికి అనుగుణంగా వ్యవహరిస్తాం. రాజకీయంగా లబ్ధి పొందాలని మాకు ఆలోచన లేదు. కొత్త పాలక వర్గానికి అభివృద్ధి చేయడానికి జిల్లా మంత్రిగా మేము సహకరిస్తాం. రాజకీయ పార్టీగా మేము మేయర్ కావాలని ఆకాంక్షిస్తున్నా. నిజామాబాద్ కాగానే కరీంనగర్ లో కుడా మెజారిటీ లేదు. మీరు (బీజేపీ) ఇండిపెండెడ్ లను కలుపుకోవడం అనైతికం కాదా..? ఆయా రాజకీయ పార్టీలకు పొత్తులు ఉంటాయి, 16వ తేదీ ఏమవుతుందో చూద్దాం” అంటూ మంత్రి పొన్నం మాట్లాడారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks