గత 12 ఏళ్లుగా ప్రతి బోర్డు సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించడం పరిపాటిగా మారిందని, అందులో కొత్తదనమేమీ లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీ ప్రాజెక్టులకు పరోక్షంగా మద్దతు పలికిన బీఆర్ఎస్ నాయకులు, అధికారం కోల్పోయాక ఓర్వలేక కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ రైతాంగం ప్రయోజనాలను కాపాడే విషయంలో తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీపడదని తేల్చి చెప్పారు.

తొమ్మిదిన్నరేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ నీటి ప్రయోజనాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఆరోపించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలోనే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరిగాయని, పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుల విస్తరణకు పునాదులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తయింది కూడా గత ప్రభుత్వ హయాంలోనేనని ప్రశ్నించారు. రాష్ట్ర సొమ్మును లూటీ చేసి, అధికారం పోయాక ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు.
గోదావరి నదీ యాజమాన్య బోర్డు 18వ సమావేశ అజెండాలో చేర్చిన అంశాలు కొత్తవేమీ కావు అని మంత్రి ఉత్తమ్ తెలిపారు. గతంలో సీతారామ ఎత్తిపోతల పథకం క్లియరెన్స్ విషయంలో ఏపీ లేవనెత్తిన నిరాధారమైన అభ్యంతరాలను తమ ప్రభుత్వం సీడబ్ల్యూసీ, జీఆర్ఎంబీ వద్ద దీటుగా తిప్పికొట్టిందన్నారు. ఈ క్రమంలోనే సీతమ్మ సాగర్ - సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులను 2025 ఏప్రిల్ 24న విజయవంతంగా సాధించి, 60 టీఎంసీల నీటి కేటాయింపులను ఖరారు చేశామని వెల్లడించారు.
తెలంగాణ ఆవిర్భావం నుంచి కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చనాకా-కొరటా, మోదికుంట వాగు, గూడెం లిఫ్ట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని ఏపీ కోరుతున్నప్పటికీ, తమ ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలతో రాష్ట్ర హక్కులను కాపాడుతోందని మంత్రి స్పష్టం చేశారు.
ముంపు సమస్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని మంత్రి విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో భేటీ అయి నిరభ్యంతర పత్రం కోసం విజ్ఞప్తి చేసిందని, నెలాఖరుకల్లా ఎన్ఓసీ లభించే అవకాశం ఉందని తెలిపారు.
{{/usCountry}}ముంపు సమస్యపై గత బీఆర్ఎస్ ప్రభుత్వం పొరుగున ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని మంత్రి విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మూడుసార్లు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రితో భేటీ అయి నిరభ్యంతర పత్రం కోసం విజ్ఞప్తి చేసిందని, నెలాఖరుకల్లా ఎన్ఓసీ లభించే అవకాశం ఉందని తెలిపారు.
{{/usCountry}}అలాగే పీబీఎల్పీ ప్రతిపాదనలపై ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ముఖ్యమంత్రి రెండుసార్లు, తాను నీటిపారుదల శాఖ మంత్రిగా ఏడుసార్లు, సీఎస్, ఉన్నతాధికారులు పదుల సంఖ్యలో కేంద్ర మంత్రిత్వ శాఖలలతో సంప్రదింపులు జరిపారన్నారు. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేశామని, దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదులకు 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందని వివరించారు.
2018-2022 మధ్య రాయలసీమకు 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులు జరుగుతుంటే బీఆర్ఎస్ ప్రేక్షక పాత్ర పోషించిందని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ ఆధునీకరణ కోసం తాము ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో మాట్లాడి ఒప్పించామని, కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు స్వయంగా హాజరై న్యాయ నిపుణులతో సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. లక్ష కోట్ల రూపాయిలతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిండా ముంచి, నీటి పారుదల రంగంలో ఎలాంటి స్పష్టత లేని బీఆర్ఎస్ నేతలు తమకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు.