Telangana ATC Skill Competitions : ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి స్కిల్ కాంపిటీషన్లు
Telangana ATC Skill Competitions : తెలంగాణలోని ఏటీసీల్లో వచ్చే ఏడాది నుంచి స్కిల్ కాంపిటీషన్లు నిర్వహించనున్నారు. టాప్-10 ఇన్నోవేటర్లకు ఉద్యోగాలతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తామని కార్మిక మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి ప్రకటించారు.
Telangana ATC Skill Competitions : రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు (ఏటీసీలు) కేవలం ఉద్యోగ శిక్షణకే పరిమితం కాకుండా…. యువతలోని సృజనాత్మకతను వెలికితీసే వేదికలుగా మారుతున్నాయని కార్మిక శాఖ మంత్రి జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు ఏటీసీల్లో రెండేళ్ల శిక్షణతోనే సొంతంగా విద్యుత్ వాహనాలు తయారు చేసే స్థాయికి ఎదగడం రాష్ట్రంలోని నైపుణ్య శిక్షణ వ్యవస్థకు పక్కా నిదర్శనమని స్పష్టం చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఏటీసీని మంగళవారం మంత్రి సందర్శించారు. అక్కడ ఏటీసీ విద్యార్థులు పార్థసారథి… స్ఫూర్తి రూపొందించిన వినూత్న విద్యుత్ వాహనాలను స్వయంగా పరిశీలించి వారిని అభినందించారు. పాత విడిభాగాలను ఉపయోగించి రూ.45 వేల వ్యయంతో స్ఫూర్తి ఎలక్ట్రిక్ కారును తయారు చేయగా, రూ.1.60 లక్షల వ్యయంతో రవాణాకు ఉపయోగపడే ఈవీని పార్థసారథి అభివృద్ధి చేశారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాలు సాధించిన పలువురు విద్యార్థులకు మంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు.
వచ్చే ఏడాది నుంచి స్కిల్ కాంపిటీషన్లు - మంత్రి
ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ…. రాబోయే ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 119 ఏటీసీలలో ప్రతి ఏటా ప్రతిభ పోటీలు (స్కిల్ కాంపిటీషన్లు) నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పోటీల్లో టాప్-10లో నిలిచే అత్యుత్తమ ఇన్నోవేటర్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడమే కాకుండా…. ఏటీసీల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రదర్శనలకే పరిమితం కాకుండా ఈ ఆవిష్కరణలను వాణిజ్య స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహకారం అందిస్తుందని చెప్పారు.
టాటా సంస్థ భాగస్వామ్యంతో సుమారు రూ.4 వేల కోట్ల పెట్టుబడితో ఈ ఏటీసీలను ఆధునికీకరిస్తున్నట్లు వివరించారు. మణుగూరు ఏటీసీలో శిక్షణ పొందుతున్న విద్యార్థుల్లో 100 మందికి టాటా సంస్థలోనే ఉద్యోగాలు కల్పిస్తామని ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులతో శిక్షణకు దూరం కాకుండా ఉండటానికి నెలకు రూ.2 వేల స్టైఫండ్, ఉచిత అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా…. టామ్‌కామ్ (TOMCOM) ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు సాధించేలా రూ.90 కోట్లతో జర్మన్, జపనీస్ భాషల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. మణుగూరులో ఐటీసీ సీఎస్‌ఆర్ నిధులతో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

