త్వరలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికలకు ఇన్ఛార్జులుగా మంత్రులను నియమించింది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జులను నియమించారు. మంగళవారం నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలు మెుదలుపెట్టాలన్నారు.

15 నియోజకవర్గాలకు 15 మందిని ఇన్ఛార్జులుగా నియమించింది కాంగ్రెస్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి.. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి మెుదటి వారం లేదంటే.. రెండో వారంలో ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోంది.
ఇన్ఛార్జిల జాబితా
- మల్కాజిగిరి-కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
- చేవెళ్ల-దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- ఖమ్మం-కొండా సురేఖ
- మహబూబాబాద్-పొన్నం ప్రభాకర్
- మహబూబ్‌నగర్-దామోదర రాజనరసింహ
- నాగర్‌కర్నూల్-వాకిటి శ్రీహరి
- జహీరాబాద్-అజారుద్దీన్
- మెదక్-వివేక్ వెంకటస్వామి
- నల్గొండ-అడ్లూరి లక్ష్మణ్ కుమార్
- భువనగిరి-సీతక్క
- నిజామాబాద్-ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కరీంనగర్-తుమ్మల నాగేశ్వరరావు
- వరంగల్-పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- పెద్దపల్లి-జూపల్లి కృష్ణారావు
- ఆదిలాబాద్-ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
తెలంగాణ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. మిగిలిన పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు పెండింగ్‌లో ఉన్న చట్టపరమైన, పరిపాలనా సమస్యలు కారణంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికలు సంబంధించి.. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
రిజర్వేషన్లు ఖరారు
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకు కేటాయించారు. కీలకమైన హైదరాబాద్ మేయర్ పీఠాన్ని మహిళా జనరల్ కు కేటాయించగా.. గ్రేటర్ వరంగల్ జనరల్‌గా నిర్ణయించారు. కరీంనగర్ కార్పొరేషన్-బీసీ జనరల్, కొత్తగూడెం కార్పొరేషన్-ఎస్టీ జనరల్, రామగుండం కార్పొరేషన్- ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. నల్గొండ కార్పొరేషన్-మహిళా జనరల్, నిజామాబాద్ కార్పొరేషన్- మహిళా జనరల్, మహబూబ్‌నగర్ కార్పొరేషన్- బీసీ మహిళ, మంచిర్యాల కార్పొరేషన్- బీసీ జనరల్, ఖమ్మం కార్పొరేషన్-మహిళా జనరల్‌గా నిర్ణయించారు.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
{{/usCountry}}మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 52,43,023 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. ఇందులో 25,62,369 మంది పురుష ఓటర్లు, 26,80,014 మంది మహిళా ఓటర్లు ఉండగా.. 640 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు.
{{/usCountry}}