హైదరాబాద్‌లో వానలు.. 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి
హైదరాబాద్‌లో రాబోయే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఐటీ కంపెనీలు రాబోయే మూడు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని పోలీసులు తెలిపారు.
రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సైబరాబాద్ ప్రాంతంలో ఐటీ కంపెనీలు, సంస్థలు నవంబర్ 3 నుండి 5 వరకు తమ ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ను అమలు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

హైదరాబాద్ నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, నవంబర్ 5 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగుల సురక్షత, రోడ్లపై ట్రాఫిక్ నివారణ, అత్యవసర సేవల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
వర్షాల వల్ల రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ స్తంభించకుండా, రహదారులపై ఒత్తిడి తగ్గించేందుకు కంపెనీలు తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల నుండి పద్ధతి ప్రకారం లాగౌట్‌లు ప్రారంభించాలి.
మధ్యాహ్నం నుండి రాత్రి వరకు వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా సాయంత్రం 4 గంటల కల్లా లాగౌట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
వర్షాలు ఉండే ఈ 3 రోజుల పాటు (నవంబర్ 3 నుండి నవంబర్ 5 వరకు) సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) వెసులుబాటు కల్పించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా పరిశీలించాలి.
నగరంలో వర్షాల సమయంలో ట్రాఫిక్‌ను సరిగ్గా నియంత్రించడానికి, అవసరమైన ప్రాంతాల్లో బలగాలను మోహరించడానికి ఐటీ కంపెనీలు తమ ముందస్తు ప్రణాళికలను పోలీసులకు తెలియజేయాలని కోరారు. కంపెనీ ఉన్న ప్రాంతం, పాటించబోయే లాగౌట్ వేళల వివరాలను cybtrcc@gmail.com కు ఇమెయిల్ ద్వారా పంపాలని సూచించారు. ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల భద్రత, ఎమర్జెన్సీ సేవల సజావు సాగడం కోసం ఐటీ కంపెనీలు, సంస్థలు పూర్తి సహకారం అందించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ కోరింది.
మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కంపెనీలు మధ్యాహ్నం 2 గంటల నుండి విడతల వారీగా లాగౌట్లను ప్రారంభించి, వీలైతే సాయంత్రం 4 గంటలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కోరారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


