...
...
Next Story

మిడిల్ క్లాస్ వాళ్లకు జూన్ నెల తలనొప్పి.. ఓవైపు స్కూల్ ఫీజులు.. మరోవైపు రైతన్నలకు పెట్టుబడి ఖర్చులు!

ఇప్పుడంతా జనాలు అమ్మో జూన్ నెల అనుకుంటున్నారు. ఇటు స్కూల్ ఫీజుల మోత మెుదలైంది. ఇప్పటికిప్పుడు పాఠశాలల్లో ఎంతో కొంత ఫీజు కట్టాల్సి ఉంటుంది. మరోవైపు రైతన్నలకు పెట్టుబడి ఖర్చుల దిగులు పట్టుకుంది.

Updated on: Jun 10, 2026, 15:51:10 IST
Advertisement

ఎండల తీవ్రత తగ్గి, చల్లని నైరుతి రుతుపవనాలు దేశాన్ని పలకరించే ఆహ్లాదకరమైన సమయం జూన్. ప్రకృతి పరంగా ఇది ఎంతో ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ, సగటు సామాన్యుడికి, అన్నదాతకు మాత్రం ఈ నెల ఆర్థిక భారాల కాలంగా మారుతోంది. "అమ్మో జూన్ నెల వచ్చింది" అంటూ మధ్యతరగతి తల్లిదండ్రులు, పెట్టుబడి సాయం కోసం ఎదురుచూసే రైతులు గుండెలు గుభేలుమనే పరిస్థితి నెలకొంది. చదువులు, సాగు పనులు ఒకేసారి ముంచుకురావడంతో జేబులకు పెద్ద ఎత్తున చిల్లులు పడుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మిడిల్ క్లాస్ ఇళ్లలో స్కూలు ఫీజులు, రైతులైతే పెట్టుబడి ఖర్చుల గురించి ఆలోచనలు చేస్తున్నారు.

స్కూల్ ఫీజుల మోత

జూన్ ఆర్థిక కష్టాలు
జూన్ ఆర్థిక కష్టాలు

జూన్ నెల రాగానే తల్లిదండ్రులను పట్టి పీడించే ప్రధాన సమస్య స్కూల్ రీ-ఓపెనింగ్స్, అడ్మిషన్ల ఫీజులు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ ఏటా 10 శాతం నుండి 15 శాతం వరకు పెరుగుతూనే ఉంది. ఎల్‌కేజీ, యూకేజీ తరగతులకే ప్రైవేట్ స్కూళ్లలో కనీసం రూ. 30,000 నుండి రూ. 50,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక హైస్కూల్ విద్యార్థులకైతే ఈ భారం రూ. 80,000 దాటుతోంది.

కేవలం ట్యూషన్ ఫీజుతోనే సరిపోదు. పుస్తకాలు, నోట్‌బుక్స్ కోసం రూ. 5,000, స్కూల్ యూనిఫాం, షూస్ కోసం మరో రూ. 4,000, వ్యాన్ లేదా బస్సు ఛార్జీల రూపంలో నెలకు రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇది కేవలం సాధారణ పాఠశాలల్లోని ఫీజులు మాత్రమే. ఇక మరికొన్ని ప్రైవేట్ స్కూళ్లలో ఈ ఫీజు డబుల్ అవుతుంది. ఇద్దరు పిల్లలున్న ఒక మధ్యతరగతి కుటుంబం జూన్ నెలలో కేవలం చదువుల కోసమే కనీసం రూ. 1,00,000 నుండి రూ. 1,500,00 వరకు సిద్ధం చేసుకోవాల్సి వస్తోంది.

అన్నదాతల పెట్టుబడి ఆరాటం

మార్చి, ఏప్రిల్ నెలల నుంచే జూన్ ఖర్చుల కోసం కొంత సొమ్మును పొదుపు చేయడం అలవాటు చేసుకోవాలి. విద్యా రుణాలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే ప్రభుత్వం కూడా ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల నియంత్రణపై కఠినమైన చట్టాలు తేవాలని, రైతులకు సకాలంలో పెట్టుబడి రాయితీలు అందించాలని ప్రజలు కోరుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe