తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా చిన్న చిన్న ఘర్షణలు తప్పా.. ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. నకిలీ ఓటింగ్ ప్రయత్నాలు, అధికార దుర్వినియోగం, డబ్బు పంపిణీ, అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు పలు ప్రాంతాల్లో ఆరోపణలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణలు జరిగినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

తుది పోలింగ్ శాతం 73.01గా ఎన్నికల సంఘం అంచనా వేసింది. మెుదట 116 మునిసిపాలిటీలు, ఏడు మునిసిపల్ కార్పొరేషన్లలో పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. 2,996 వార్డులలో ఎన్నికలు జరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మొత్తం పోలింగ్ శాతం 62.55 శాతంగా ఉంది. 3.26 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం, 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది. చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 శాతం అత్యధికంగా నమోదవ్వగా.. అత్యల్పంగా నందికొండలో 59.68 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక కార్పొరేషన్లలో అత్యధికంగా నల్గొండలో 77.36 శాతం, అత్యల్పంగా నిజామాబాద్‌లో 59.12 శాతం ఓట్లు పడ్డాయి. 72.63 శాతం పురుష ఓటర్లు, 73.39 శాతం మహిళా ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.
పోలింగ్ వేగం పుంజుకుంటున్న కొద్దీ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. కరీంనగర్ పట్టణంలోని 58వ డివిజన్‌లో ఒక ఓటరు తన ఓటు ఇప్పటికే వేసినట్టుగా ఫిర్యాదు చేయడంతో పోలింగ్ స్టేషన్ వద్ద రెండు గ్రూపులు ఘర్షణ పడ్డాయి. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నాగర్ కర్నూల్‌లోని 15వ వార్డులో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు బోగస్ ఓటింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుండి బయటకు పంపిన తర్వాత బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ పోలింగ్ కేంద్రంలో పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
{{/usCountry}}బీజేపీ అభ్యర్థిని పోలింగ్ కేంద్రం నుండి బయటకు పంపిన తర్వాత బీజేపీ ఎంపి ధర్మపురి అరవింద్ పోలింగ్ కేంద్రంలో పోలీసు అధికారులపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
{{/usCountry}}మరోవైపు సంగారెడ్డి మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రం దగ్గర చోటుచేసుకున్న ఉద్రిక్తతలో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డిపై కేసు నమోదు చేసి.. నివేదిక ఇవ్వాలని ఎస్పీకి ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఓటర్ల మనోభావాలు దెబ్బతినేలా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేశారని ఎస్ఈసీ అభిప్రాయపడింది. ఎన్నికల కమిషన్ చర్యలపై జగ్గారెడ్డి మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ దొంగ ఓట్లపైనే తాను ప్రశ్నించానని వివరణ ఇచ్చారు.