...
...
Next Story

కర్రెగుట్టలు : ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట.. ఇక మీదట టూరిజం స్పాట్!

Karreguttalu : ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఇక మీదట టూరిజం స్పాట్‌గా మారనుంది. ఇక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.

Updated on: Apr 8, 2026, 15:48:36 IST
Advertisement

ములుగు జిల్లాలోని కర్రెగుట్టలు అంటే.. మావోయిస్టులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేది. కీలక నేతలు ఇక్కడ తలదాచుకునేవారు. కానీ ఇప్పుడు ఈ ప్రాంతం బలగాల చేతుల్లోకి వచ్చేసింది. ప్రభుత్వం కూడా దీనిని ఎకో టూరిజం హబ్‌గా మార్చాలని భావిస్తోంది. మావోయిస్టు రహిత ప్రాంతంగా మారిందని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. మావోయిస్టుల ఉనికి తెలంగాణలో లేదన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

అపారమైన అటవీ సంపదతో, సుందరమైన సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందిన కర్రెగుట్టల ప్రాంతాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పర్యటించే పర్యాటకులకు పూర్తి భద్రత కల్పించే లక్ష్యంతో పామునూరు ప్రత్యేక పోలీస్ అవుట్‌పోస్ట్ నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది.

పామునూరు ఆపరేటింగ్ బేస్ సమీపంలో ఇంటర్ ఏజెన్సీ కో-ఆర్డినేషన్ సెంటర్, పోలీస్ ఔట్ పోస్ట్ నిర్మాణానికి పోలీసు అధికారులతో కలిసి డీజీపీ శంకుస్థాపన చేశారు. మురుమూరు నుంచి పామునూరుకు, అక్కడి నుంచి తడపల అనే ప్రాంతానికి 13 కిలోమీటర్ల రహదారి నిర్మాణం కూడా జరుగుతోంది.

కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఇప్పుడు లేదని డీజీపీ పేర్కొన్నారు. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ ఆదివాసీ సమాజానికి అండగా నిలుస్తూ, వారి సామాజిక, ఆర్థిక ఉన్నతికి కృషి చేస్తాయని తెలిపారు.

కర్రెగుట్టలు ప్రాంతం వంటి కొండ ప్రాంతాలలో వ్యూహాత్మక స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడానికి, అలాగే ఆ ప్రాంతం మావోయిస్టు కార్యకలాపాల రహితంగా ఉండేలా చూసుకోవడానికి రాష్ట్ర పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాల మధ్య నిరంతర సమన్వయం అత్యవసరం అని డీజీపీ శివధర్ రెడ్డి నొక్కి చెప్పారు.

ఇక మెుత్తానికి తెలంగాణలో నక్సలిజం లేదని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. కర్రెగుట్టలు ప్రాంతాన్ని టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తోంది. ఏదైనా ఏజెన్సీకి టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయాలని బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. నైట్ స్టేలు, హోటళ్లులాంటివి కూడా రావొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి తరహాలో టూరిజం స్పాట్‌గా చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks