తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు - 28,456 నామినేషన్లు దాఖలు
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 28 వేల 456 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగనుంది.
మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల పర్వం పూర్తయింది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు కలిపి మొత్తం 28,456 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం చివరి రోజు కావటంతో భారీగా నామినేషన్లు వచ్చాయి. ప్రధాన పార్టీలే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ చేసేందుకు ఆసక్తి చూపారు.

ఫిబ్రవరి 11న పోలింగ్…
నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయిన నేపథ్యంలో ఇవాళ పరిశీలిస్తారు. ఫిబ్రవరి 1, 2 తేదీల్లో తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీల్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఫిబ్రవరి 3 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు.
మరోవైపు ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు కూడా ఆసక్తి కనబరిచారు. మిర్యాలగూడ పురపోరులో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కుటుంబం నుంచి బరిలో నిలిచారు. ఆయన భార్య మాధవి, కుమారులు సాయిప్రసన్న, ఈశ్వర గణేష్‌లను కౌన్సిలర్లుగా బరిలోకి దించారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కుమార్తె తేజస్విని 20 వార్డుకు నామినేషన్ దాఖలు చేసి బరిలో నిలిచారు. నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని బి.వేణు అనే వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
కొన్ని మున్సిపాలిటిల్లో టికెట్లు దక్కని నేతలు… రెబల్ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. పార్టీ బీఫారమ్ దక్కకపోవటంతో సొంతగానే పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే వీరితో ఆయా పార్టీల నేతలు మంతనాలు జరుపుతున్నారు.
కీలకమైన నామినేషన్ల పర్వం ముగియటంతో ఇక ప్రచారంలోకి దిగేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇంఛార్జులను మోహరించిన ఆయన పార్టీలు… ప్రచారాన్ని హోరెత్తించే దిశగా ముందుకెళ్లే పనిలో పడ్డాయి. సీఎం రేవంత్ రెడ్డితో సహా మంత్రులు కూడా ఈ ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
ఇక ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాటు చేస్తోంది. ఎన్ని ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన TE-Poll మొబైల్ యాప్ ను కూడా తాజాగానే అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఎన్నికలకు సంబంధించి సమస్యలుంటే ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ యాప్ ను తీసుకువచ్చినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అంతేకాకుండా tsec.gov.in ద్వారా కూడా కంప్లైయిట్స్ ఇవ్వొచ్చని సూచించారు.
ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ వివరాలను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిర్యాదు చేయటమే కాకుండా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. టీ-పోల్ మొబైల్ యాప్'ను ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుందని ఈసీ అధికారులు చెప్పారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

