రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ పాగా వేయగా… మరికొన్నిచోట్ల బీఆర్ఎస్ కూడా గెలిచింది. మరోవైపు బీజేపీ, ఎంఐఎం కూడా కొన్ని ప్రాంతాల్లో సత్తా చాటగా…. ఈసారి స్వతంత్రులు కూడా ఎక్కువగానే గెలిచారు. అయితే ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఇవాళ కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి. ఈ నేపథ్యంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్ోతంది.
నేడే ప్రమాణస్వీకారం…

మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లకు సంబంధించి నూతనంగా ఎన్నికైన వార్డు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత కీలమైన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లను కలుపుకొని ఈ ఎన్నిక ప్రక్రియ చేపడతారు. ఆ తర్వాత మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇందుకు అనుగుణంగా అన్ని జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేశారు.
కాకపుట్టిన హంగ్…!
మెజార్టీలు వార్డులు లేదా డివిజన్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ దాటిన చోట చైర్మన్, వైస్ చైర్మన్, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక సాఫీగానే పూర్తయ్యే అవకాశం ఉంది. కానీ హంగ్ వచ్చిన చోటే తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపిన ఆయా పార్టీలు…. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేసేందుకు క్యాంపుల నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయాలకు తరలిచేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌పై అందరి చూపు ఉంది. బీజేపీ అతిపెద్ద పార్టీగా ఇక్కడ అవతరించింది. కానీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. దీంతో అధికార కాంగ్రెస్.. ఎట్టిపరిస్థితిల్లోనూ తగ్గేది లేదని డిసైడ్ అయింది. ఇక్కడ జెండా ఎగురవేసేందుకు పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తుండటంతో ఉత్కంఠభరితంగా మారింది. ఫిబ్రవరి 16న మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను గెలుచుకోవడంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటి నెలకొంది.
కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కూర్చోవాలంటే అవసరమైన సంఖ్యా బలం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్లను గెలుచుకున్నాయి. మిగిలిన 10 డివిజన్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళాయి. ఇప్పుడు వీరే కీలకం అయ్యారు.
{{/usCountry}}కరీంనగర్ లో మొత్తం 66 డివిజన్లలో అత్యధికంగా 30 డివిజన్లను బీజేపీ గెలుచుకున్నప్పటికీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై కూర్చోవాలంటే అవసరమైన సంఖ్యా బలం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీ 14, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 3 డివిజన్లను గెలుచుకున్నాయి. మిగిలిన 10 డివిజన్లు స్వతంత్ర అభ్యర్థులకు వెళ్ళాయి. ఇప్పుడు వీరే కీలకం అయ్యారు.
{{/usCountry}}నిజామాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మేయర్ పదవికి ఉత్కంఠ నెలకొంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని మొత్తం 60 డివిజన్లలో 28 డివిజన్లను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించినప్పటికీ, మేయర్ ఎన్నికల్లో 31 అనే మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకోవడం బీజేపీకి కష్టతరమైన పనిగా ఉంది. 17 డివిజన్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, 14 డివిజన్లను గెలుచుకున్న AIMIM మద్దతుపై ఆధారపడుతోంది. బీఆర్ఎస్ ఒకే ఒక డివిజన్‌ను గెలుచుకుంది. గెలిచిన వ్యక్తి కూడా కాంగ్రెస్‌లో చేరాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.
కొత్తగూడెం మేయర్ పదవీకాలాన్ని చెరో రెండున్నరేళ్లు పంచుకోవడానికి కాంగ్రెస్, సీపీఐ ఒప్పందం చేసుకున్నాయి. ఇక్కడ దాదాపుగా ఎలాంటి ఇబ్బందులు రాకపోవచ్చని తెలుస్తోంది.ఇక మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ - సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. బలం బీఆర్ఎస్ వైపు ఉండగా… క్యాతనపల్లి చైర్మన్ పీఠం కోసం కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు చేస్తోంది.
మహబూబాబాద్‌లో కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 11 చోట్ల గెలవడంతో హంగ్ ఏర్పడింది. అయితే ఎక్స్ ఆఫీషియో ఓట్లతో పాటు స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎన్నిక నేపథ్యంలో ఆయా కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాట్లు చేశారు. ఒకవేళ ఎక్కడైనా ఎన్నిక వాయిదా పడితే తిరిగి ఈనెల 17వ తేదీన చేపట్టే అవకాశం ఉంది.