మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలకు శుభవార్త. నేషనల్ ఆయుష్ మిషన్ (National AYUSH Mission) కింద ఆయుష్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్‌లలో వివిధ సేవలందించేందుకు గాను అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం 6 విభాగాల్లో ఖాళీగా ఉన్న 8 పోస్టులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 12, 2026 నుండి అక్టోబర్ 22, 2026 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టులు, జీతం, అర్హతలు
ఆయుష్ డాక్టర్ 1 పోస్టు నెలకు వేతనం రూ.60,000, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఆయుర్వేద, యూనానీ, హోమియోపతి లేదా నేచురోపతి విధానంలో పీజీ డిగ్రీ కలిగి ఉండాలి.
ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 2 పోస్టుల ఉన్నాయి. నెలకు రూ.40,000 ఇస్తారు. సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
1 యోగా ప్రొఫెషనల్ పోస్టు ఉంది. నెలకు వేతనం రూ.28,000 ఇస్తారు. నేచురోపతిలో డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ నేచురోపతి అండ్ యోగిక్ సైన్సెస్ కలిగి ఉండాలి.
డైటీషియన్ పోస్టు ఒకటి ఉండగా.. నెలకు వేతనం రూ.20,000 వరకు జీతం ఇస్తారు. బి.ఎస్సీ న్యూట్రిషన్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుల సంఖ్య 2 ఉండగా.. నెలకు వేతనం రూ.15,000 ఇస్తారు. 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సైకిల్ లేదా మోటార్ సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి.
సైకోసోషల్ కౌన్సెలర్ (ఆన్ కాల్) పోస్టుల సంఖ్య 1. వేతనం ప్రతి సెషన్‌కు రూ.500(సంవత్సరానికి కనీసం 200 విజిట్లు/సెషన్లు). మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
{{/usCountry}}సైకోసోషల్ కౌన్సెలర్ (ఆన్ కాల్) పోస్టుల సంఖ్య 1. వేతనం ప్రతి సెషన్‌కు రూ.500(సంవత్సరానికి కనీసం 200 విజిట్లు/సెషన్లు). మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
{{/usCountry}}01-07-2026 నాటికి అభ్యర్థుల వయస్సు కనీసం 18 సంవత్సరాలు, గరిష్టంగా 44 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు ఇస్తారు. సైనికోద్యోగులకు 3 సంవత్సరాల సడలింపు దొరుకుతుంది.
మొత్తం 100 మార్కులకు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. అర్హత పరీక్షల్లో సాధించిన మార్కులకు 90 మార్కుల వెయిటేజీ ఇస్తారు(మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుకు రాత పరీక్ష ద్వారా 90 మార్కులు ఉంటాయి). మెరిట్ జాబితా, రిజర్వేషన్ రూల్స్ ఆధారంగా ఎంపికల తుది జాబితాను విడుదల చేస్తారు.
దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు సంబంధిత దరఖాస్తు ఫారాన్ని మహబూబ్‌నగర్ జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://mahabubnagar.telangana.gov.in/recruitments/ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తు పత్రాలను అవసరమైన ధృవపత్రాల Self-attested ప్రతులతో కలిపి నేరుగా గానీ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా గానీ సమర్పించాలి.
సమర్పించాల్సిన చిరునామా: గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆవరణలో (TGMSID ఇఈ ఆఫీస్ పక్కన), మహబూబ్‌నగర్ జిల్లా.
దరఖాస్తుకు చివరి తేదీ 22-10-2026 సాయంత్రం 05:00 గంటల వరకు ఉంది. గడువు ముగిసిన తర్వాత లేదా పోస్టల్ ఆలస్యం వల్ల ఆలస్యంగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించబోరని అధికారులు స్పష్టం చేశారు.