1 నుండి 19 ఏళ్ల పిల్లలకు ఆరోగ్య శాఖ నుంచి అప్డేట్.. జులై 13న ఆ టాబ్లెట్స్ పంపిణీ!

జులై 13న రాష్ట్రవ్యాప్తంగా అల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ నులిపురుగు నిర్మూలన దినోత్సవంలో భాగంగా ఈ విషయాన్ని ప్రకటించింది.

Published on: Jul 12, 2026, 14:10:26 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లో జులై 13, 2026న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం(National Deworming Day) నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ ఉచితంగా అల్బెండజోల్ (Albendazole) మాత్రలను పంపిణీ చేయనున్నారు.

తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం

ఏదైనా కారణంగా జులై 13న మాత్రలు తీసుకోలేకపోయిన లేదా గైర్హాజరైన పిల్లల కోసం జూలై 20, 2026న Mop-Up Day నిర్వహిస్తారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 96,81,855 మంది పిల్లలను లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల ద్వారా ఒకే రోజున ఈ మాత్రలను నిర్దేశిత పద్ధతిలో ఉచితంగా అందజేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ, విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం జరగనుంది. పిల్లల వయస్సును బట్టి మాత్రలను ఈ క్రింది విధంగా అందించాలని అధికారులు స్పష్టం చేశారు:

1 నుండి 2 సంవత్సరాలు: సగం మాత్ర (½ Tablet - పొడి చేసి ఇవ్వాలి)

2 నుండి 3 సంవత్సరాలు: ఒక పూర్తి మాత్ర (1 Tablet - పొడి చేసి ఇవ్వాలి)

3 నుండి 19 సంవత్సరాలు: ఒక పూర్తి మాత్ర (1 Tablet - నమిలి మింగాలి)

1 నుండి 3 సంవత్సరాల పిల్లలకు మాత్రను బాగా పొడి చేసి, నీటితో కలిపి తాగించాలి. 3 ఏళ్లు పైబడిన పిల్లలు మాత్రను నమిలి, ఆపై 2-3 గుటకల నీరు తాగాలి. ఈ అల్బెండజోల్ 400mg మాత్రలు 100 శాతం సురక్షితమైనవి. అయితే ఈ మాత్రలను ఇంటికి తీసుకువెళ్లడానికి ఇవ్వరు, సిబ్బంది సమక్షంలోనే వేసుకోవాలి.

నులిపురుగుల నిర్మూలన వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లల్లో రక్తహీనత తగ్గుతుంది. మట్టి ద్వారా సంక్రమించే నులిపురుగుల ఇన్ఫెక్షన్లు పూర్తిగా నశిస్తాయి. పిల్లలు మరింత చురుగ్గా, ఉత్సాహంగా ఉంటారు. అనారోగ్యం తగ్గడం వల్ల పాఠశాలలకు హాజరు శాతం పెరుగుతుంది. పిల్లల భవిష్యత్తు, ఆరోగ్య రక్షణకై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More