...
...
Next Story

NEET PG Exam : నీట్ పీజీ అభ్యర్థులకు అలర్ట్.. ఈ రూట్‌లలో పరీక్ష కేంద్రాలకు అస్సలు వెళ్లకండి

NEET PG Exam : ఆగస్టు 30వ తేదీన నీట్ పీజీ పరీక్ష ఉంది. హైదరాబాద్‌లో పరీక్షలు రాసేవారు పలు రూట్‌ల వైపు వెళ్లకూడదని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ రూట్‌ నుంచి వెళ్లకూడదో తెలుసుకోండి.

Published on: Aug 29, 2026, 11:40:45 IST
Advertisement

ఆగస్టు 30న ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ 2026(15వ ఎడిషన్) జరగనున్న నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రయాణ హెచ్చరికలు జారీ చేశారు. అదే రోజు నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) పరీక్ష కూడా ఉంది. దీంతో పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పశ్చిమ హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులను తప్పించి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్ మారథాన్ ఆదివారం ఉదయం 5:00 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు కీలక రహదారులపై సాగనుంది.

ప్రధాన మారథాన్ మార్గం

కేబుల్ బ్రిడ్జ్ నుండి ప్రారంభమై ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ గేట్ నెం. 8, మై హోమ్ ఆభ్ర, సీ గేట్ జంక్షన్, ఐకియా (మైండ్ స్పేస్ రోటరీ), ట్రాన్స్‌కో, ఎన్‌సీబీ/బయోడైవర్సిటీ జంక్షన్, పిస్తా హౌస్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, ఇందిరా నగర్, ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం వరకు సాగుతుంది.

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రూట్: ప్రొఫెసర్ సి.ఆర్.రావు రోడ్డులో ఉన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం గేట్ నెం. 2 ద్వారా రన్నర్లు క్యాంపస్‌లోకి ప్రవేశిస్తారు. మరలా అదే గేట్ నుంచి బయటకు వచ్చి గచ్చిబౌలి స్టేడియం వైపు తిరుగుప్రయాణమవుతారు.

ఐకియా వద్ద కలవనున్న 10 కే రన్

మరోవైపు 10 కే రన్ మాదాపూర్‌లోని హైటెక్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఎన్ఏసి మెయిన్ గేట్, ఖానామెట్ జంక్షన్, మెటల్ చార్మినార్ జంక్షన్, టెక్ మహీంద్రా, లెమన్ ట్రీ హోటల్, రాయదుర్గం మెట్రో స్టేషన్, ఐకియా అండర్‌పాస్ మీదుగా సాగుతుంది. ఐకియా పరిసర ప్రాంతాల్లో ఈ 10 కే రన్ రూట్, ప్రధాన మారథాన్ మార్గంతో కలుస్తుంది.

అభ్యర్థులు దూరంగా ఉండాల్సిన కీలక రహదారులు

మొదటి మార్గం: కేబుల్ బ్రిడ్జ్ – ఐటీసీ కోహినూర్ – మై హోమ్ ఆభ్ర – ఐకియా (మైండ్ స్పేస్) – ఎన్‌సీబీ జంక్షన్ – గచ్చిబౌలి ఫ్లైఓవర్ – ఇందిరా నగర్ – ఐఐఐటీ జంక్షన్ – గచ్చిబౌలి స్టేడియం – హైదరాబాద్ వర్సిటీ గేట్ నెం. 2.

రెండో మార్గం: ఎన్ఏసీ మెయిన్ గేట్ – మెటల్ చార్మినార్ – టెక్ మహీంద్రా – లెమన్ ట్రీ హోటల్ – రాయదుర్గం మెట్రో స్టేషన్ – ఐకియా అండర్‌పాస్.

ముందస్తుగా బయలుదేరాలి

హైదరాబాద్ మారథాన్ కారణంగా ఐటీ కారిడార్‌లో తీవ్ర ట్రాఫిక్ మళ్లింపులు, రద్దీ ఉండే అవకాశం ఉన్నందున NEET-PG అభ్యర్థులు చాలా ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని సైబరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) కోరారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకుని ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షా కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని తెలిపారు. అలాగే పరీక్ష రాయబోతున్న విద్యార్థులందరికీ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ విభాగం శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రశాంతంగా పరీక్ష రాయాలని ఆకాంక్షించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks