హైదరాబాద్ నగరంలోని రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. ప్రయాణికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, స్టేషన్ ఆవరణలో వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి చర్లపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో సరికొత్త యాక్సెస్, పార్కింగ్ నిబంధనలను ప్రవేశపెట్టారు. స్టేషన్ పరిధిలోని సౌత్ టెర్మినల్, అంటే ప్లాట్‌ఫారమ్ నంబర్ 9 వైపు ఈ కొత్త నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. ప్రయాణికులను దింపడానికి లేదా పికప్ చేసుకోవడానికి వచ్చే వాహనాల కోసం ప్రత్యేకంగా ఉచిత సమయాన్ని కేటాయించడంతో పాటు నిర్దేశిత రుసుములను ఖరారు చేశారు.
20 నిమిషాలు ఫ్రీ…..

రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ వాహనదారులకు ఊరటనిస్తూ 20 నిమిషాల పాటు ఉచిత పికప్ మరియు డ్రాప్ సదుపాయాన్ని కల్పించారు. నిర్ణీత 20 నిమిషాల సమయం దాటితే మాత్రం ఓవర్‌స్టే ఫీజు వర్తిస్తుంది. దీని ప్రకారం… పికప్ లేన్‌లో నిలిపే వాహనాలకు 20 నిమిషాల నుండి 30 నిమిషాల వరకు రూ. 50, 30 నిమిషాల నుండి 45 నిమిషాల వరకు రూ. 100, 45 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు రూ. 200 వసూలు చేస్తారు. వాహనాన్ని ఒక గంట కంటే ఎక్కువ సమయం నిలిపితే రూ. 500 భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రయాణికులు అదనపు రుసుముల భారం పడకుండా ముందస్తుగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు స్టేషన్ వద్ద వాహనాలను ఎక్కువ సమయం పార్కింగ్ చేయాలనుకునే వారి కోసం ప్రత్యేక పార్కింగ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ గంటల వారీగా ధరలను నిర్ణయించారు. ఫోర్ వీలర్స్ (కార్లు, ఇతర నాలుగు చక్రాల వాహనాలు) పార్కింగ్ చేయడానికి మొదటి రెండు గంటలకు రూ. 20 వసూలు చేస్తారు. అలాగే టూ వీలర్స్, త్రీ వీలర్స్ (ద్విచక్ర వాహనాలు, ఆటోలు) నిలపడానికి మొదటి రెండు గంటలకు రూ. 15 రుసుము ఉంటుంది. ఈ మొదటి రెండు గంటల సమయం ముగిసిన తర్వాత, ఆపై ప్రతి అదనపు గంటకు రూ. 10 చొప్పున అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ మొత్తం పార్కింగ్ , నిబంధనల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. వాహనదారుల సౌకర్యార్థం డిజిటల్ టికెటింగ్ మరియు డిజిటల్ రసీదుల (Digital Ticketing & Receipts) విధానాన్ని ప్రవేశపెట్టారు. క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డిజిటల్ పద్ధతిలో రుసుములు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. చర్లపల్లి స్టేషన్ మీదుగా ప్రయాణించే వారు ఈ మార్పులను గమనించి రైల్వే సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.
{{/usCountry}}ఈ మొత్తం పార్కింగ్ , నిబంధనల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడానికి దక్షిణ మధ్య రైల్వే అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. వాహనదారుల సౌకర్యార్థం డిజిటల్ టికెటింగ్ మరియు డిజిటల్ రసీదుల (Digital Ticketing & Receipts) విధానాన్ని ప్రవేశపెట్టారు. క్యూ లైన్లలో వేచి ఉండే అవసరం లేకుండా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా డిజిటల్ పద్ధతిలో రుసుములు చెల్లించేలా ఏర్పాట్లు చేశారు. చర్లపల్లి స్టేషన్ మీదుగా ప్రయాణించే వారు ఈ మార్పులను గమనించి రైల్వే సిబ్బందికి సహకరించాలని అధికారులు కోరారు.
{{/usCountry}}