జీవవైవిధ్య పరిశోధనల్లో శాస్త్రవేత్తలు మరో కీలక ముందడుగు వేశారు. తూర్పు కనుమల (Eastern Ghats) పరిధిలోని మంచినీటి ఆవాసాల్లో నీటి ఉపరితలం కింద తలకిందులుగా ఈదే విలక్షణ లక్షణం కలిగిన ఒక కొత్త జల కీటకాన్ని పరిశోధకులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం బయోస్పియర్ రిజర్వ్, తెలంగాణలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతాల్లో ఈ కొత్త కీటక జాతిని కనుగొన్నారు.

దక్కన్ పీఠభూమి ప్రాంతంలోని తూర్పు కనుమల్లో గుర్తించినందున ఈ కొత్త కీటక జాతికి ‘ఎనిథారెస్ డెక్కనెన్సిస్’ (Enithares deccanensis Banerjee et al, 2026) అని శాస్త్రవేత్తలు పేరు పెట్టారు. ఇది నోటోనెక్టిడే కుటుంబానికి చెందినది. సాధారణ భాషలో వీటిని ‘బ్యాక్‌స్విమ్మర్స్’ అని పిలుస్తారు. నీటిలో తలకిందులుగా ఉండి, తెడ్డు మాదిరిగా ఉండే తమ పొడవైన వెనుక కాళ్ల సాయంతో అత్యంత వేగంగా ఈదడం వీటి ప్రత్యేకత.
హైదరాబాద్‌లోని జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ZSI), తమిళనాడు విరుదునగర్‌లోని వీహెచ్ఎన్ఎస్ఎన్ (VHNSN) కళాశాలకు చెందిన పరిశోధకులు సోమేష్ బెనర్జీ, దేవదాస్ కుమార్, డాక్టర్ దీపా జైస్వాల్, కరుతపాండి మాదసామి ఈ అధ్యయనాన్ని సంయుక్తంగా నిర్వహించారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన వివరాలను అంతర్జాతీయ పీర్-రివ్యూడ్ సైన్స్ జర్నల్ ‘జర్నల్ ఆఫ్ నేచురల్ హిస్టరీ’ ఇటీవల ప్రచురించింది.
ఎనిథారెస్ జాతికి చెందిన ఇతర కీటకాలతో పోలిస్తే కొత్త రకం భిన్నమైన శారీరక లక్షణాలను కలిగి ఉంది. దీని రెక్కలపై ముదురు రంగులో ‘V’ ఆకారపు గుర్తు ఉండటంతో పాటు, మగ కీటకంలో కొడవలి ఆకారపు పునరుత్పత్తి అవయవం ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు.
శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల్లో లేత, ముదురు రంగు రూపాలు రెండూ కనిపించాయి. ఒకే జాతి కీటకాల్లో ఇలా భిన్న రంగులు కనిపించడం జీవశాస్త్ర పరంగా ఆసక్తికరమైన అంశం. ఈ కీటకం పూర్తిగా కొత్త జాతి అని నిరూపించేందుకు పరిశోధకులు సమగ్ర వర్గీకరణ విధానాన్ని అనుసరించారు. బాహ్య రూప పరిశీలనతో పాటు డీఎన్ఏ బార్‌కోడింగ్, ఫైలోజెనెటిక్ విశ్లేషణలు నిర్వహించగా, ఇది ఇతర సమీప జాతుల కంటే 10 నుండి 14.5 శాతం జన్యుపరమైన వ్యత్యాసాన్ని కలిగి ఉందని స్పష్టమైంది.
{{/usCountry}}శాస్త్రవేత్తలు సేకరించిన నమూనాల్లో లేత, ముదురు రంగు రూపాలు రెండూ కనిపించాయి. ఒకే జాతి కీటకాల్లో ఇలా భిన్న రంగులు కనిపించడం జీవశాస్త్ర పరంగా ఆసక్తికరమైన అంశం. ఈ కీటకం పూర్తిగా కొత్త జాతి అని నిరూపించేందుకు పరిశోధకులు సమగ్ర వర్గీకరణ విధానాన్ని అనుసరించారు. బాహ్య రూప పరిశీలనతో పాటు డీఎన్ఏ బార్‌కోడింగ్, ఫైలోజెనెటిక్ విశ్లేషణలు నిర్వహించగా, ఇది ఇతర సమీప జాతుల కంటే 10 నుండి 14.5 శాతం జన్యుపరమైన వ్యత్యాసాన్ని కలిగి ఉందని స్పష్టమైంది.
{{/usCountry}}ఈ కీటకాలు మంచినీటి ఆవాసాల్లో దోమల లార్వాలు, చిన్న కీటకాలు, టాడ్‌పోల్స్‌ను ఆహారంగా తీసుకుంటూ పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. నీటిలో ఏర్పడే చిన్నపాటి అలజడులను సైతం గుర్తించి ఇవి పసిగడతాయి.
'అడవుల్లో ఉండే చిన్నపాటి మంచినీటి వాగులు, నీడతో కూడిన రాతి గుంతలు, జలపాతాల వద్ద ఏర్పడే మడుగులు ఎంతో అరుదైన జీవవైవిధ్యానికి ఆలవాలంగా నిలుస్తున్నాయి. ప్రపంచానికి ఇప్పటివరకు తెలియని ఎన్నో జీవరాశులు ఇలాంటి చిన్న నీటి వనరుల్లో ఉన్నాయని ఈ ఆవిష్కరణ నిరూపిస్తోంది.' అని డాక్టర్ దీపా జైస్వాల్ అన్నారు.