రాష్ట్రంలో భూముల విలువలు కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందుకు భూముల ధరలను క్రమబద్ధీకరించాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన, ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం, ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించామని వెల్లడించారు.

'ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR), పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువలను నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 5వ తేదీ నుంచి సవరించిన భూముల కొత్త విలువలు అమలులోకి రానున్నాయి.' అని మంత్రి పొంగులేటి పేర్కొ్న్నారు.
అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించామన్నారు మంత్రి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సవరణలు చేపట్టామని వెల్లడించారు. భూ లావాదేవీలలో పారదర్శకత పెంపు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు.
రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే ప్రభుత్వ విలువలు భారీగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలను సరిచేస్తూ పారదర్శకమైన విధానాన్ని తీసుకొచ్చారు. కొత్త మార్కెట్ విలువలను కేటాయించడానికి ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. ఆయా ప్రాంతాల భవిష్యత్తు వృద్ధి రేటును అంచనా వేశారు.
రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, అది సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మరియు మౌలిక వసతుల కల్పనకు దోహదపడుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సవరణలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 5 నుంచి భూములు కొనుగోలు చేసేవారు సవరించిన కొత్త ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, అది సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మరియు మౌలిక వసతుల కల్పనకు దోహదపడుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సవరణలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 5 నుంచి భూములు కొనుగోలు చేసేవారు సవరించిన కొత్త ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.
{{/usCountry}}