తెలంగాణలో జూన్ 5 నుంచి కొత్త భూముల ధరలు.. మారనున్న మార్కెట్ విలువ!

తెలంగాణలో భూముల మార్కెట్ విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి కొత్త విలువల నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు.

Published on: Jun 4, 2026, 05:38:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో భూముల విలువలు కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అందుకు భూముల ధరలను క్రమబద్ధీకరించాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన, ఆర్థిక నిపుణులు అరవింద్ సుబ్రమణ్యం ఇచ్చిన నివేదిక ప్రకారం, ఉన్నతాధికారుల సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకుని విస్తృత స్థాయిలో అధ్యయనం నిర్వహించామని వెల్లడించారు.

తెలంగాణలో మారనున్న భూముల ధరలు
తెలంగాణలో మారనున్న భూముల ధరలు

'ప్రాంతాల అభివృద్ధి సామర్థ్యం, వృద్ధి రేటు, ఇటీవల జరిగిన భూముల వేలాలు, మార్కెట్ పరిస్థితులు, డిమాండ్, కొత్త రహదారులు, వృద్ధి కారిడార్లు, ఔటర్ రింగ్ రోడ్ (ORR), రీజినల్ రింగ్ రోడ్ (RRR), పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని మార్కెట్ విలువలను నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 5వ తేదీ నుంచి సవరించిన భూముల కొత్త విలువలు అమలులోకి రానున్నాయి.' అని మంత్రి పొంగులేటి పేర్కొ్న్నారు.

అనేక మున్సిపాలిటీలు మున్సిపల్ కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ కావడం, గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీల్లో విలీనం కావడం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆర్‌సీసీ, నాన్-ఆర్‌సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించామన్నారు మంత్రి. ప్రజలకు ఇబ్బందులు లేకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా, పారదర్శకతకు పెద్దపీట వేస్తూ సవరణలు చేపట్టామని వెల్లడించారు. భూ లావాదేవీలలో పారదర్శకత పెంపు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందన్నారు.

రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే ప్రభుత్వ విలువలు భారీగా హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఈ వ్యత్యాసాలను సరిచేస్తూ పారదర్శకమైన విధానాన్ని తీసుకొచ్చారు. కొత్త మార్కెట్ విలువలను కేటాయించడానికి ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. ఆయా ప్రాంతాల భవిష్యత్తు వృద్ధి రేటును అంచనా వేశారు.

రిజిస్ట్రేషన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరిగి, అది సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మరియు మౌలిక వసతుల కల్పనకు దోహదపడుతుంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వాస్తవ మార్కెట్ పరిస్థితులకు అద్దం పడుతూ ఈ సవరణలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. జూన్ 5 నుంచి భూములు కొనుగోలు చేసేవారు సవరించిన కొత్త ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More