...
...
Next Story

తెలంగాణలో కొత్తగా 3 సిటీలకు ఓఆర్‌ఆర్‌లు.. ఆధ్యాత్మిక, పర్యాటక కారిడార్లతో మాస్టర్ ప్లాన్

తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ ప్రణాళికను ప్రకటించారు. ప్రధాన నగరాల రూపురేఖలు మార్చేలా సరికొత్త కారిడార్లు, మౌలిక సదుపాయాలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.

Published on: May 13, 2026, 22:40:29 IST
Advertisement

మెగా గ్రోత్ కారిడార్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఆర్థిక, పర్యాటక రంగాలు పుంజుకునేలా ఈ ప్రణాళికలు ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు (ORR) నిర్మించాలని వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని ఈ రహదారుల నిర్మాణం జరపాలన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సింగరేణి సంస్థకు చెందిన సీఎస్ఆర్ నిధులను స్థానిక ప్రాంతాల అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. నల్గొండ - యాదగిరిగుట్ట మధ్య టెంపుల్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. ఆదిలాబాద్, నాగోబా, బాసర, కడెం ప్రాజెక్టులను కలుపుతూ టూరిజం కారిడార్ నిర్మించాలన్నారు. అలంపూర్ జోగులాంబ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మహబూబ్‌నగర్ - భూత్పూర్ - జడ్చర్ల పట్టణాలను అనుసంధానించేలా కారిడార్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. కొత్తగూడెం - పాల్వంచ - సుజాతనగర్ కారిడార్ ఏర్పాటు చేయాలన్నారు. మున్సిపాలిటీల్లో సోలార్ పవర్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహించాలన్నారు. రేడియేషన్ తగ్గించేందుకు మల్టీ యుటిలిటీ టవర్ల ఏర్పాటు చేయాలన్నారు. అధునాతన డ్రైనేజీ వ్యవస్థ కోసం సాంకేతికత వినియోగించాలని ఆదేశించారు.

పార్కింగ్ సమస్యలపై దృష్టి పెట్టండి

ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ఉబర్ సంస్థకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. అవకాశం ఉంటే మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయింది. ఉబర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.

దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ, భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. మల్టీలెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఉబర్ ప్రతినిధులకు సూచించారు.

తగిన పార్కింగ్ సౌకర్యాలు లేక మెట్రో స్టేషన్ల వంటి ప్రాంతాల్లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతో పాటు పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించారు. ముఖ్యమంత్రి సూచనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని ఉబర్ ప్రతినిధి బృందం తెలిపింది.

హైదరాబాద్‌కు సమీపంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ అంశాన్ని ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఈ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదని అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం ముందుకు వచ్చాయన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks